క్రీడాభూమి

ప్రపంచ కప్ గెలిచే ఆయుధాలున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌ను గెలిచే సాధనా సంపత్తితో కూడిన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ అన్నాడు. ‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ సత్తా చాటగలిగే ఆటగాళ్లు మనకు ఉన్నారు. అదేవిధంగా నాలుగో స్థానంలో ఆడేందుకు సైతం తగిన క్రికెటర్లకు కొదవలేదు. జట్టులో నాలుగో స్థానంలో ఎవరిని బరిలో పంపాలన్న దానిపై ఏమాత్రం ఆందోళన చెందడం లేదు’ అని పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌లో జరిగే మెగా టోర్నీకి టీమిండియాలో 15 మంది సమర్థులైన క్రికెటర్లను ఎంపిక చేశారు. ఆటగాళ్లంతా అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఒక ఫాస్ట్ బౌలర్‌కు పెద్ద గాయమైతే తప్ప ఆ స్థానంలో సరైన ప్రత్యామ్నాయం గురించి ఇంకా ఆలోచించలేదు. మొత్తానికి ప్రపంచ కప్‌లో ఆడేందుకు టీమిండియా పూర్తి ధీమా, అంతకుమించిన నమ్మకంతో ముందుకు వెళ్లబోతోంది’ అని పేర్కొన్నాడు. టీమిండియాకు ఎంపిక చేసిన 15 మంది క్రికెటర్లలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను కీలకమైన నాలుగో స్థానంలో పంపించే అంశం ఇపుడు అప్రస్తుతమని, ఆ స్థానంలో ఆడేందుకు ఎంతోమంది కీలక ఆటగాళ్లు ఉన్నారని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని ఆ స్థానంలో బరిలోకి దింపాలో ఆలోచించి తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశాడు. ఈనెల 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్‌లో ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా సంపూర్ణ ఆయుధ, సాధనా సంపత్తితో ముందుకు వెళ్తుందంటూ ‘క్రికెట్ నెక్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయపడడం, మరోపక్క మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడం గురించి ప్రస్తావించినపుడు ‘ఈ అంశాలు నన్ను ఏకోశానా ఆందోళనకు గురిచేయవు’ అని అన్నాడు. ‘వాస్తవానికి చెప్పాలంటే ఆ అంశాల జోలికే ఇంకా వెళ్లలేదు. మా టీమంతా ఈనెల 22న ఇక్కడ నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. అప్పటికల్లా 15 మంది జట్టు సభ్యుల్లో ఎవరు ఉంటారో తేలుతుంది. అందుకు అనుగుణంగా తుది జట్టు టూర్‌కు వెళ్తుంది. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ విషయానికొస్తే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు కనుక అప్పటివరకు ఇంకా టైమ్ ఉంది కనుక వేచిచూద్దాం’ అని అన్నాడు. ‘ఇలాంటి మెగా టోర్నీలో ఏ జట్టు కూడా ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకోదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. గడిచిన నాలుగేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు చవిచూశాం. ఒత్తిడిని సైతం అనుభవించాం’ అని వ్యాఖ్యానించాడు. ‘వెస్టిండీస్, ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్లుగా రాణిస్తున్నాయి. అయితే, వెస్టిండీస్ భారత్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడిన సందర్భంగా వారు గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. విండీస్‌లో అద్భుతంగా రాణించే సత్తా కలిగిన క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ వంటివారు ఉన్నారు. కరేబియన్ల హిట్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే. అయితే, రానున్నది గట్టి పోటీ గల మెగా టోర్నీ కానున్న నేపథ్యంలో గెలుపు కోసం టీమిండియా అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది.’ అని ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ అన్నాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా గురించి ప్రస్తావించిన ఆయన గడిచిన 25 ఏళ్లలో ఆ టీమ్ అందరి కంటే ఎక్కువగా ఐదుసార్లు వరల్డ్ కప్‌ను గెల్చుకుందని అన్నాడు. మెగా టోర్నీలో ఆడే ఏ జట్టుకైనా ఆసిస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నాడు. ఇపుడు ఆ జట్టులో చక్కని సామర్థ్యం కలిగిన యువ క్రికెటర్లతోపాటు పలువురు దిగ్గజ ఆటగాళ్లు కూడా ఉండడం వల్ల ఆ జట్టు మరింత బలం పుంజుకోవడంతోపాటు పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
టీమిండియానే ఫేవరిట్: అజారుద్దీన్
హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న మెగా ప్రపంచ కప్‌లో టీమిండియానే ఫేవరిట్ కానుందని మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం భారత జట్టులో అత్యంత అద్భుతంగా బౌలింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్లు ఉండడం కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. ‘మనకు మంచి చాన్స్ ఉంది. జట్టు కూర్పు చాలా బాగుంది. మంచి బౌలర్లు ఉన్నారు. ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం బౌలర్లందరికీ వికెట్లు అనుకూలంగా ఉంటే మాత్రం మనకు కొంచెం కష్టమే. కానీ మన బౌలర్లు ప్రత్యర్థి టీమ్‌ను కట్టడి చేసే చక్కని సామర్థ్యం ఉన్నవారు. ప్రపంచస్థాయి బౌలర్లు ఉండడం మనకు కలిసొచ్చే అంశం’ అని అజారుద్దీన్ పేర్కొన్నాడు. ‘టీమిండియా కూర్పు చాలా బాగుంది. ఒకవేళ ప్రపంచ కప్‌ను గెలవకుంటే మాత్రం నేను నిరాశకు గురవుతాను’ అని ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నాడు. టీమిండియాలో ఫాస్ట్‌బౌలర్ల విభాగానికి నాయకత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లలో ప్రపంచంలోని అగ్రస్థానంలోని బౌలర్లలో ఒకడుగా రాణిస్తున్నాడు. అదేవిధంగా మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య వంటి వారు కూడా మనకు ఉండడం కలిసొచ్చే అంశం అని అన్నాడు. ‘వరల్డ్ కప్‌లో ఫేవరిట్ ఎవరు అని నన్ను అడిగితే టీమిండియానే అని తప్పక చెబుతాను. భారత్ నెంబర్ వన్. ఆ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంటాయి. అయితే, క్రికెట్‌లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఏదైనా జరుగవచ్చు. బాగా రాణించగలిగే సత్తా ఉన్న జట్టే అన్నివిధాలా రాణించేందుకు అవకాశాలు ఉంటాయి. టీమిండియానే ఫేవిరిట్ అవుతుంది’ అని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేర్కొన్నాడు.
చిత్రం... భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ