క్రీడాభూమి

ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో హాకీ టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌ను ఏ దశలోనూ సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. జెరెమీ హేవార్డ్, బ్లేక్ గోవర్స్ చెరి రెండు గోల్స్ సాధించి ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపారు. మ్యాచ్ 15వ నిమిషంలోనే గోవర్స్ తొలి గోల్ చేసి, ఆసీస్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత ఐదు నిమిషాలకే హేవార్డ్ చేసిన గోల్‌తో ఆసీస్ ఆధిక్యం పెరిగింది. అనంతరం భారత ఆటగాళ్లు గోల్స్ కోసం విఫలయత్నాలు చేయగా, ఆస్ట్రేలియా వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయిన భారత్ దాదాపుగా మ్యాచ్ చివరి వరకూ అవకాశం కోసం ఎదురుచూసింది. కానీ, అలాంటి అవకాశాలేవీ ఇవ్వకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాగ్రత్త పడ్డారు. మ్యాచ్ చివరిలో మరోసారి చెలరేగిన ఆసీస్‌కు 59వ నిమిషంలో గోవర్స్ గోల్ అందించాడు. నిమిషం వ్యవధిలోనే హేవార్డ్ తన ఖాతాలో రెండో గోల్ వేసుకున్నాడు. మొత్తం నాలుగు గోల్స్ సాధించిన ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బందు లేకుండా విజయభేరి మోగించింది. భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేక, చేతులెత్తేసింది.
చిత్రం...బ్లేక్ గోవర్స్