క్రీడాభూమి

ఫిట్నెస్ సాధించిన కేదార్ జాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు వరల్డ్‌కప్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో జాదవ్ భారత్ తరఫున ఎంపిక య్యాడు. అయతే ఐపీఎల్ చెన్నై సూ పర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన 34 ఏళ్ల జాదవ్ కింగ్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యాంగా గాయపడ్డాడు. దీంతో ప్రపంచ కప్‌కు అందుబాటులో ఉంటాడ లేదా అనే సందే హాలు వ్యక్తమయ్యాయ. అయతే టీమిండి యా ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ పర్యవేక్షణలో తిరిగి ఫిట్నెస్ సాధించాడు. ముంబయ క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో జాదవ్ ఫిట్‌నెస్ సాధించినట్లు పాట్రిక్ బీసీసీఐకి నివేదించాడు. దీంతో మిగ తా సభ్యులతో పాటు ఈ నెల 22న ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నా డు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 59 వనే్డలాడి 102.53 స్ట్రైక్‌రేట్‌తో 1174 పరుగులు చేశాడు. భారత్ ఈ ఏడాది ప్రపంచ కప్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికా తో తన మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ నెల 25 నుంచి 28 వరకు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వామప్ మ్యాచ్‌ల్లో తలపడనుంది.