క్రీడాభూమి

కోహ్లీపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్ -11
*
న్యూఢిల్లీ, మే 18: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ దగ్గరపడుతున్నకొద్దీ క్రికెట్ ఫీవర్ జోరందుకుంది. 10 జట్లు పోటీ పడుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో అందరి దృష్టి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే కేంద్రీకృతమై ఉంది. అభిమానులకు అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని ఒక టెస్టు సిరీస్‌ను సాధించిన తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ వ్యూహాలు ఎలా ఉంటాయో అనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్యాట్స్‌మన్‌గా అతను భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటూ అతను కెప్టెన్సీకి కొత్త అర్థం ఇచ్చాడు. 1983లో భారత జట్టుకు తొలిసారి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన కపిల్ దేవ్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో మిగతావారికి మార్గదర్శకంగా నిలిచాడు. అప్పట్లో చాలామంది సీనియర్ క్రికెటర్లు జట్టులో ఉండడంతో వారందరితోటి కలసిమెలసి ఉండేవాడు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటూనే తనదైన శైలిలో జట్టును నడిపించేవాడు. కాగా, 2011లో రెండోసారి భారత్ ఈ మెగాట్రోఫీని సొంతం చేసుకున్నపుడు జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా ఆడే ధోనీకి మ్యాచ్ ఫినిషర్‌గా మంచి పేరుంది. అతను ఏమి ఆలోచిస్తాడో, అతని వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ ఒకపట్టాన అర్థం కావు. 3మిస్టర్ కూల్2 అన్న పేరు ధోనీకి అతికినట్టు సరిపోతుంది. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా నిర్ణయాలు తీసుకునే ధోనీతో పోలిస్తే కోహ్లీ వైఖరి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగితే, సామరస్య ధోరణిని ధోనీ అనుసరిస్తే ఎదురుదాడికి దిగడం కోహ్లీకి అలవాటు. ప్రత్యర్థులు ఒకటంటే తాను రెండు అనే కోహ్లీ పద్ధతి జట్టులో యువ ఆటగాళ్లకు ఒకరకంగా మార్గదర్శకం అయింది. అతని దూకుడు చాలా సందర్భాల్లో జట్టుకు సానుకూల ఫలితాలను సాధించిపెట్టినప్పటికీ కొన్ని సమయాల్లో సమస్యల్లోకి నెట్టేసింది. అయితే, తాను స్వయంగా అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు కాబట్టే కోహ్లీపై పెద్దగా విమర్శలు లేవు. వ్యూహరచనలో అతని వేగాన్ని అందుకోవడం ఇతరులకు సాధ్యం కాదనే చెప్పాలి. మాజీ కెప్టెన్ ధోనీని సంప్రదిస్తూనే చాలా సందర్భాల్లో తాను స్వయంగా తీసుకుని సంచలన ఫలితాలను రాబట్టాడు. కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 41 వనే్డ సెంచరీలు ఉన్నాయి. సుమారు 7 వారాలపాటు జరిగే వరల్డ్ కప్‌లో అతను ఈ సంఖ్యను మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వనే్డల్లో 11,000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం కూడా ఉంది. కోహ్లీకి సరైన డిప్యూటీగా రోహిత్ శర్మను పేర్కోవాలి. వైస్‌కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న అతను ఇప్పటికే వనే్డల్లో 3 డబుల్ సెంచరీలు చేశాడు. నాలుగో డబుల్ సెంచరీకి వరల్డ్ కప్ వేదిక అవుతుందేమో చూడాలి. ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ ఈవెంట్స్‌లో ఎప్పుడూ విఫలం కాలేదు. బంతి శరవేగంగా దూసుకువచ్చే ఫాస్ట్ ట్రాక్స్‌పై అతను అద్భుతంగా రాణించగలడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో అతను అక్కడి పిచ్‌ల స్వభావాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయం. అయితే, ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతావారు ఏ స్థాయిలో రాణిస్తారనేది అనుమానంగానే ఉంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగే అంబటి రాయుడు అనుకున్న రాణించలేకపోతున్నాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయగల యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. దీంతో స్టాండ్ బై వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ నాలుగో స్థానంలో బరిలోకి దించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 14 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ ఏనాడూ అతనికి సరైన అవకాశం రాలేదు. వచ్చిన అవకాశాన్ని నూరు శాతం వినియోగించుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో, ఐపీఎల్‌లో భారత క్రికెటర్ల జాబితాలో టాప్ స్కోరర్‌గా ఉన్న లోకేష్ రాహుల్ పేరును మిడిలార్డర్‌లో పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గతంలో మాదిరిగా అద్భుతాలు సృష్టిస్తాడా అన్నది వేచిచూడాలి. ఆల్‌రౌండర్లు విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించే ప్రమాణాలను ప్రదర్శిస్తారనుకోవడం అత్యాశ అవుతుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కోహ్లీ జట్టు కూర్పును ఏవిధంగా చేస్తాడనేది ఆసక్తి రేపుతోంది.