క్రీడాభూమి

విండీస్ ప్రపంచకప్ జట్టులో బ్రేవో, పొలార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్ (అంటిగ్వా), మే 19: వెస్టిండీస్ ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో డ్వేన్ బ్రేవోకు చోటు దక్కింది. గతంలో ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో చోటు దక్కని వీరిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేస్తూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మందితో కూడిన రిజర్వ్ బెంచ్‌ని విండీస్ ప్రకటించగా, అందులో స్టార్ బ్రేవోతో పాటు కీరాన్ పొలార్డ్ కూడా చోటు దక్కించుకున్నారు. అయతే ముందుగా ప్రకటించిన 15మంది జాబితాలో ఎవరైనా గాయపడితేనే వీరు ఆడే అవకాశముంది. 2018లోనే బ్రేవో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకగా, అతడి అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే బోర్డు బ్రేవోతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంది. మే 26, 28 తేదీల్లో విండీస్ వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌లను ఆడనుంది. ఆ తర్వాత మే 31న జరిగే మెగా టోర్నీలో తన మొదటి మ్యాచ్‌లో ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా పాక్‌తో తలపడనుంది. బ్రేవో చివరిసారిగా 2016లో పాకిస్తాన్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.
వెస్టిండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), క్రిస్‌గేల్, కీమన్ రోచ్, డారెన్ బ్రేవో, అండ్రూ రస్సెల్, షై హోప్, షెల్డన్ కాట్రేల్, ఈవిన్ లూయస్, షెనాన్ గాబ్రియేల్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఆష్లే నర్స్, షీమ్రాన్ హిట్‌మెయర్, ఫెబియన్ అల్లెన్, ఓషానె థామస్, నికోలస్ పూరన్.