క్రీడాభూమి

మరోసారి.. కంగారూల కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఆస్ట్రేలియా.. ప్రపంచ క్రికెట్‌లో ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా మట్టికరిపించే జట్టు. అలాంటి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచి తమకు సాటెవ్వరూ లేరని నిరూపించింది. ఈసారీ మే 30 నుంచి ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా నిర్వహించే మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బారిలోకి దిగనుంది. హాట్ ఫెవరేట్లుగా ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ బరిలోకి దిగుతు న్నా మీరు కప్ గెలవాలంటే మమ్మల్ని దాటి వెళ్లాల్సి ఉంటుందని సవాల్ విసురుతోం ది. అంతేకాకుండా ఆరోసారి ప్రపంచకప్‌ను గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది.
1987లో తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన కంగారులు ఆ తర్వాత 1999, 2003, 2007లో వరుసగా ప్రపంచకప్‌లు గెలుచుకొని తమ జట్టు ఎంత బలమైనదో చాటిచెప్పారు. చివరిసారిగా 2015లోనూ ఫైనల్ న్యూజిలాండ్‌పై గెలిచి ఐదోసారి సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడారు.
ఈసారీ ఈజీ కాదు..
గతంలో క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా జట్టుకు ఈ ఏడాది కప్పు సాధించడం అంత సులువేం కాదు. గత కొంతకాలంగా వరుస ఓటములతో సతమతమవుతున్న కంగారులు ప్రపంచకప్ ముందు మాత్రం పాకిస్తాన్, భారత్‌తో జరిగిన సిరీస్‌లను గెలిచి తమ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదని నిరూపించారు. పాకిస్తాన్‌తో సిరీస్‌ను వదిలేస్తే, ప్రస్తుత క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టుగా పేరుగాంచిన భారత్‌ను స్వదేశంలోనే మట్టికరిపిం చింది. దీంతో అప్పటివరకు ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్తుందా.. లేదా అనే సందేహంలో ఉన్న ప్రత్యర్థి జట్లకు మేమూ పోటీలో ఉన్నామని హెచ్చరికలు జారీ చేసింది.
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో..
గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. దీంతో అప్పట్లో జట్టు వరుస వైఫల్యాలను చవిచూసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కొత్తవాడే అయనా జట్టును సమన్వయంగా నడిపించాడు. కానీ భారత్ చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడంతో సర్వత్రా విమర్శలొచ్చాయ. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించి సిరీస్‌ను గెలిచారు. మరోవైపు ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా స్వదేశంలో జరిగే వనే్డ, టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. సరైన సమయంలో బలమైన భారత జట్టుపై నెగ్గి వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఫించ్ సేన తమ ఆట తీరులో మార్పేమీ లేదని నిరూపించింది.
నిషేధం తర్వాత.. మరింత బలంగా..
బాల్ ట్యాంపరిగ్ వివాదం తర్వాత ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పునరాగమ నం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన వార్నర్ ఏడాది కసిని తీర్చుకున్నాడు. టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 692 పరుగులు చేసి, అందరికంటే ముందు వరుసలో నిలిచి, తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 8 అర్ధ సెంచరీలుండడం విశేషం. అయతే అప్పటికే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించిన వార్నర్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ముందుగానే స్వదేశానికి తిరిగి వెళ్లాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిథ్యం వహించిన స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో చెలరేగాడు. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివర్లో జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.
ప్రారంభానికి ముందే విమర్శలు..
మెగా టోర్నీకి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీయాలనే కారణంగా ఇంగ్లాడ్ క్రికెట్ ఫ్యాన్ క్లబ్ ‘బార్మీ ఆర్మీ’ ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ముఖ్యంగా డేవిడ్ వార్నర్‌ను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనికి వార్నర్, జట్టు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా, కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం స్పందించారు. తమను ఎన్ని విధాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మైదానంలోనే సమాధానం చెబుతామంటూ బదులిచ్చాడు. అయతే ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం వార్నర్ , స్మిత్‌లు కీలకంగా మారతారని ఆ జట్టు కోచ్ లాంగర్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌల్టర్ నైట్, ప్యాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియాన్, షాన్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్ క, మార్కస్ స్టొయనిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

చిత్రం...డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్
*కోచ్ లాంగర్ (ఇన్‌సెట్‌లో)