క్రీడాభూమి

ఆస్ట్రేలియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్ -10
వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక విజయాలు సాధించి జట్ల జాబితాలో ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటి వరకూ జరిగిన మొత్తం 11 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఆడిన ఆ జట్టు ఐదు సార్లు టైటిల్ సాధించింది. 1987, 1999, 2003, 2007, 2015 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. 84 మ్యాచ్‌లు ఆడి, 62 విజయాలు నమోదు చేసింది. ఈ జాబితాలో రెండో స్థానాన్ని భారత్, వెస్టిండీస్ ఆక్రమించుకున్నాయి. భారత్ కూడా 11 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడింది. 1983, 2011 సంవత్సరాల్లో టైటిల్ సాధించింది. 75 మ్యాచ్‌ల్లో 46 విజయాలు సాధించింది. కాగా, 11 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన వెస్టిండీస్ 1975, 1979 సంవత్సరాల్లో వరుసగా రెండు పర్యాయాలు టైటిల్ అందుకుంది. 71 మ్యాచ్‌లు ఆడి, 41 విజయాలను నమోదు చేసింది. 11 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన పాకిస్తాన్ (1992), శ్రీలంక (1996) చెరొకసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి.
ఇలా ఆడాయి..
ఇంగ్లాండ్ ఆతిథ్య దేశం హోదాలో, 1975 మొదటి వరల్డ్ కప్ టోర్నీకి నేరుగా అర్హత సంపాదించింది. అప్పట్లో క్వాలిఫయర్స్ లేవుకాబట్టి, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో శాశ్వత సభ్యత్వం ఉన్న భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లకు కూడా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా జట్లను పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. మొత్తం మీద తొలి వరల్డ్ కప్‌లో ఎనిమిది జట్లు అరంగేట్రం చేశాయి. 1979లో కెనడా, 1983లో జింబాబ్వే జట్లు తొలిసారి వరల్డ్ కప్‌లో ఆడాయి. జాత్యహంకారంతో వ్యవహరిస్తున్న కారణంగా నిషేధానికి గురైన దక్షిణాఫ్రికా 1992లో వరల్డ్ కప్ ఆడింది. నిషేధాన్ని ఐసీసీ తొలగించడంతో, ఆ జట్టుకు మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. 1996లో కెన్యా, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టాయి. 1999లో బంగ్లాదేశ్, స్కాట్‌లాండ్ జట్లకు అవకాశం దక్కింది. 2003లో నమీబియా, 2007లో బెర్ముడా, ఐర్లాండ్ జట్లు అరంగేట్రం చేశాయి. 2015లో అఫ్గానిస్థాన్ క్వాలిఫయర్స్‌లో నెగ్గి, తొలి వరల్డ్ కప్ టోర్నీ ఆడింది.
చిత్రం... డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా