క్రీడాభూమి

ఆనందం.. విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, మే 20: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీది ఆనందించాలో లేక బాధపడాలో తెలియని పరిస్థితి. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు తొలుత ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు దక్కలేదు. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా ప్రకటించిన జాబితాలో అతని చేర్చింది. అయితే, వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికయ్యానన్న ఆనందాన్ని మించిన విషాదం చోటు చేసుకుంది. కేన్సర్ బారిన పడి, దుబాయ్‌లో చికిత్స పొందుతున్న అతని కుమార్తె మృతి చెందిన సమాచారం అందింది. ఒకవైపు వరల్డ్ కప్‌కు ఎంపికయ్యానన్న ఆనందం, మరోవైపు కుమార్తె మృతి చెందిందన్న బాధ అసిఫ్ అలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈనెల 30 నుంచి వరల్డ్ కప్ టోర్నీలో ప్రారంభంకానున్న నేపథ్యంలో, అతను స్వదేశానికి వెళ్లి, తిరిగి వచ్చి జట్టుతో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొన్న అసిఫ్ అలీ తమ జట్టు పరాజయం ఎదుర్కొన్న చివరి వనే్డలో 22 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్‌ను ఓడించిన ఇంగ్లాండ్ 4-0 ఆధిక్యంతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అసిఫ్ అలీ రెండు అర్ధ శతకాలు సాధించాడు. అందులో, కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు 52 పరుగులు ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన అతను ఇంత వరకూ 16 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఆడి, 31.09 సగటుతో 342 పరుగులు చేశాడు.

చిత్రం... అసిఫ్ అలీ