క్రీడాభూమి

కలిసిరాని కప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్9
న్యూఢిల్లీ: నాలుగు సార్లు సెమీస్.. రెండు సార్లు క్వార్టర్ ఫైనల్.. గ్రూప్ స్టేజీలో నాకౌట్‌కు ఒకసారి.. ఇది ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు రికార్డు. టోర్నీకి ముందు ప్రతిసారీ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగే ప్రొటియాస్ ఇప్పటికీ 7 మెగా టోర్నీల్లో పాల్గొంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మలుపు తిప్పే బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు ఉన్నా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఒక్కసారంటే ఒక్కసారీ విజేతగా నిలవలేకపోయంది. గ్రూప్ స్టేజీ నుంచే ప్రత్యర్థి జట్లను గడగడలాడించే దక్షిణాఫ్రికా, ఆ తర్వాత జరిగే కీలక మ్యాచుల్లో సొంత తప్పిదాలు, నిర్ణయాలతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదోలగడం పరిపాటైంది. 1992 నుంచి ప్రపంచకప్‌లో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదిక గా జరిగే మెగాటోర్నీలో డుప్లెసిస్ ఎలా ఆడుతుందో చూడాలి.
గత ప్రపంచకప్‌లో సూపర్ షో..
2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు లీగ్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 6 మ్యాచ్‌లాడిన ప్రొటియాస్ జట్టు 4 విజయాలు సాధించి, రెండింటా ఓడింది. మొత్తం 8 పాయంట్లు సాధించింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించిన డివిల్లియర్స్ సేన శ్రీలంకతో తలపడింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన లంక 37.2 ఓవర్లలోనే 133 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా డికాక్ అర్ధసెంచరీతో కేవలం 18 ఓవర్లలోనే విజయం సాధించి, సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.
కరుణించని ప్రకృతి..
సెమీస్‌లో న్యూజిలాండ్ తలపడిన దక్షిణాఫ్రికాకు ఈసారీ ప్రకృతి కూడా కరుణించలేదనే చెప్పాలి. వర్షం కారణంగా 43 వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు డుప్లెసిస్, డివిలియర్స్ అర్ధ సెంచరీలు చేయడంతో 5 వికెట్లు కోల్పోయ 281 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కివీస్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది.
నరాలు తెగే ఉత్కంఠ..
ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్లే అవకాశం. మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దక్షిణాఫ్రికా గెలుపు ఖాయం అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి రెండు బంతుల్లో న్యూజిలాండ్ విజయానికి 5 పరుగులు అవసరం. అవతలి ఎండ్‌లో స్పీడ్ గన్ డేల్ స్టెయన్ బౌలింగ్ క్రీజులో గ్రాంట్ ఇలియంట్ అప్పటికే అర్ధ సెంచరీ చేసి మంచి ఊపు మీదున్నాడు. నరాలు తెగే ఉత్కంఠతో ప్రేక్షకులు మ్యాచ్ చూస్తున్నారు. ఐదో బంతిని వేసిన స్టెయన్‌కి షాక్.. ఇలియంట్ ఆ బంతిని సిక్సర్‌గా మలచడంతో దక్షిణాఫ్రికా కన్నీటితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దక్షిణాఫ్రికా జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), హషీం అమ్లా, క్వింటన్ డీకాక్, జేపీ డుమినీ, ఇమ్రాన్ తాహీర్, ఎయడెన్ మార్ కరమ్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, లుంగి ఎంగిడి, ఫెలుక్‌వాయో, డ్వెయన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షసీ, డేల్ స్టెయన్, వాన్ డర్ డసెన్.
2011లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత్ 2011లో నాకౌట్ దశకు కూడా చేరుకోకుండా, గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. నిజానికి, 2012 డిసెంబర్ 31న ప్రపంచ ర్యాంకింగ్స్‌ను లెక్కించే సమయానికి వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అప్పటి వరల్డ్ కప్ టోర్నీకి ఆ ర్యాంకింగ్స్‌నే ప్రమాణికంగా తీసుకోవడంతో, పూల్ ‘ఏ’లో భారత్‌కు మొదటి స్థానం దక్కింది. కానీ, గ్రూప్ దశను అధిగమించలేకపోయింది. ఒక డిఫెండింగ్ చాంపియన్ ఈ విధంగా, అత్యంత అవమానకరంగా ఇంటిదారి పట్టడం చాలా అరుదు.
* భారత బ్యాట్స్‌మన్ సౌరవ్ గంగూలీ ఒకే వరల్డ్ కప్ టోర్నీలో మూడు సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పాడు.
* ప్రపంచ కప్‌లో భారత్ ఎన్నడూ పాకిస్తాన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కోలేదు.
ఇంగ్లాండ్ దురదృష్టం
11 పర్యాయాలు ప్రపంచ కప్‌లోపాల్గొని, మూడు పర్యాయాలు ఫైనల్ చేరినప్పటికీ, దురదృష్టం వెంటాడిన ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది. 1979, 1987, 1992 సంవత్సరాల్లో ఫైనల్ వరకూ వెళ్లిందిగానీ, తుది పోరాటాల్లో పరాజయాలను చవిచూసింది. కాగా, న్యూజిలాండ్ సైతం 11 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంది. 2015లో రన్నరప్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికకా నాలుగు సార్లు (1992, 1999, 2007, 2015) సెమీ ఫైనల్ వరకూ వెళ్లి, ఫైనల్ చేరలేక నిష్క్రమించింది. కెన్యా ఎవరూ ఊహించని విధంగా 2003లో ఒకసారి సెమీ ఫైనల్ వరకూ చేరింది.
*
ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్
వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ 1975 ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తుది పోరులో అతను 102 పరుగులు చేసి, విండీస్ టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 1979 వరల్డ్ కప్ ఫైనల్లో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు కైవసం చేసుకున్నాడు. 1983లో ఈ అవార్డు భారత ఆల్‌రౌండర్ మహీందర్ అమర్‌నాథ్‌కు లభించింది. ఫైనల్లో అతను 26 పరుగులు చేశాడు. కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చడం ద్వారా భారత్ విజయానికి బాటలు వేశాడు. 1987 ఫైనల్లో డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా/ 75 పరుగులు), 1992 ఫైనల్లో అసీం అక్రం (పాకిస్తాన్/ 33 పరుగులు, 49 పరుగులకు మూడు వికెట్లు), 1996 ఫైనల్లో అరవింద డిసిల్వ (శ్రీలంక, 107 నాటౌట్, 42 పరుగులకు మూడు వికెట్లు), 1999 ఫైనల్లో షేన్ వార్న్ (ఆస్ట్రేలియా/ 33 పరుగులకు నాలుగు వికెట్లు), 2003లో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా/ 140 నాటౌట్), 2007 ఫైనల్లో ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా/ 149 పరుగులు), 2011 ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ ( భారత్/ 91 నాటౌట్), 2015 ఫైనల్లో జేమ్స్ ఫాల్క్‌నర్ (ఆస్ట్రేలియా/ 36 పరుగులకు మూడు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు.
అంచనాల్లేకుండానే..
‘గత ప్రపంచకప్‌ల న్నీ భారీ అంచనాలతో బరిలోకి దిగాం. దాంతో మాకు మేమే ఒత్తిడికి గు రయ్యాం. కానీ ఈసారీ ఎలాంటి అంచనాల్లేకుం డానే బరిలోకి దిగుతు న్నాం. గత కొంతకాలంగా మానసికంగా ధృడంగా ఉండేలా సిద్ధమయ్యాం. ఎలాంటి ప్రణాళికలకు వెళ్లకుండా అన్ని మ్యాచ్‌ల ను సహజంగానే ఆడతాం’ అని దక్షిణా ఫ్రికా జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. మరోవైపు ప్రస్తుత జట్టులో చాలామందికి ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం లేకపోవడం దక్షిణా ఫ్రికా జట్టుకు ఇబ్బందికర అంశమే.
*

చిత్రాలు.. నిరాశలో అప్పటి కెప్టెన్ డివిలియర్ స
*2015 ప్రపంచకప్‌లో తన బౌలింగ్‌లో మ్యాచ్ చేజారడంతో నిరాశతో మైదానంలో కూలబడ్డ
దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయన్‌ను చేయచాపి లేపుతున్న గ్రాంట్ ఇలియట్
*సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో కన్నీటి పర్యంతమవున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు