క్రీడాభూమి

భారత షట్లర్ల పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నింగ్, మే 21: సుదిర్‌మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సమీర్‌వర్మ పురుషుల సింగిల్స్‌లో మంగళవారం జరిగిన స్ట్రెయిట్ గేమ్‌లో ఓటమి చెందినా మిక్స్‌డ్ ఈవెంట్‌లో మాత్రం భారత షట్లర్లు మెరిశారు. గ్రూప్-1డీ మ్యాచ్‌లో మలేషియాపై గెలుపుతో నాకౌట్ స్టేజికి చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి, అశ్విని పొన్నప్ప అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మలేషియా జోడీ గోహ్ సూన్ హుయాట్, లాయ్ షెవన్ జెమీలను 16-21, 21-17, 24-22 తేడాతో ఓడించారు. గంట 10 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ 1-0తో ఆధిక్యత సాధించింది. అదేవిధంగా ఒలింపిక్-వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ పతక విజేత పీవీ సింధు గోహ్ జిన్ ఉయ్‌ని 21-12, 21-8తో ఓడించగా, డబుల్స్‌లో మను అత్రి, సుమీత్‌రెడ్డి జోడీ 20-22, 19-21 తేడాతో అరోన్ చియా, తియో ఈ ఇయ్ చేతిలో ఓటమిని చవి చూశారు.