క్రీడాభూమి

అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు నిర్వహించనున్న ట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధి కారులు తెలిపారు. బీసీసీఐలో నెలకొన్న గందర గోళాన్ని తొలగించేందుకు సుప్రీం కోర్టు రెండేళ్ల క్రితం ప్రత్యేకంగా సీఓఏను నియమించింది. వినోద్‌రాయ్ ఈ కమిటీకి చీఫ్‌గా, డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ రవి తోగ్డేలు సభ్యులుగా న్యా యస్థానం చేత నియమించబడ్డారు. బీసీసీఐకి చెందిన పూర్తి అధికారాలను వారికి అప్పగించారు. దీంతో అప్పటినుంచి భారత క్రికెట్‌కు సం బంధించిన ఏ విషయమైనా ఈ కమిటీనే చూసుకుంటోంది. అయతే సుప్రీం నియమించిన సీఓఏ పాలన ను ఆపాలని.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని పీఎస్ నర్సింహా కమిటీ ఓ రిపోర్టును రూపొందించింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చలను జరిపిన ఈ కమిటీ చివరకు బీసీసీఐ ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని నూతన బోర్డుకు అప్పగించాలని ఆ రిపోర్టులో పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకున్న సీఓఏ బీసీసీఐ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైంది.