క్రీడాభూమి

ప్రయోగానికి ఫిఫా స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనె్న, మే 23: ప్రయోగాలకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ స్వస్తి చెప్పింది. 2022 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను 48 జట్లతో నిర్వహించాలన్న ఆలోచనను విరమించింది. గతంలో మాదిరిగానే 32 జట్లతోనే టోర్నమెంట్ జరుగుతుందని ప్రకటించింది. ఫిఫా పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోకు ఎదురు దెబ్బగా పేర్కోవాలి. ఫుట్‌బాల్‌ను మరింత విస్తృత పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే, వరల్డ్ కప్ సాకర్‌లో జట్ల సంఖ్యను 48కు పెంచాలని ఇన్ఫాంటినో ఆలోచన. ఆయన ఈ ప్రతిపాదనను చాలాకాలంగా చేస్తునే ఉన్నాడు. వచ్చేనెల 5వ తేదీన జరిగే ఫిఫా సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే, పాలక మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఇన్ఫాంటినోతో వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాకర్‌ను మరింత విస్తరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2020 కతార్ వరల్డ్ కప్ సాకర్‌ను 48 జట్లతో నిర్వహిస్తే 300 నుంచి 400 మిలియన్ డాలర్ల ఆదా యం అదనంగా వస్తుందన్న వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి ఈ దిశగా అడుగులు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పాలక మండలిలో ఎక్కువ శాతం మంది సభ్యులు వ్యతిరేకించడంతో, 48 జట్లతో వరల్డ్ కప్ సాకర్ నిర్వాహణ ప్రతిపాదన అటకెక్కింది.