క్రీడాభూమి

నాకు రెస్ట్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తనకు కొంతకాలం విశ్రాంతి అవసరమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. వెస్టిండీస్‌లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో చోటు చేసుకున్న వివాదం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌కు ఆమె విశ్రాంతినివ్వడమే వివాదానికి కారణమైంది. ఆ మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో హర్మన్‌ప్రీత్‌పై విమర్శలు చెలరేగాయి. బీసీసీఐ కూడా ఈ నిర్ణయంపై తీవ్రంగానే స్పందించింది. కోచ్ రమేష్ పోవార్‌ను తొలగించి, అతని స్థానంలో బాధ్యతను మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్‌కు అప్పగించింది. కాగా, టీ-20 వరల్డ్ పూర్తయిన వెంటనే, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆడింది. అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా హర్మన్‌ప్రీత్‌కు విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. దీనికితోడు, వనే్డ ఫార్మాట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో సత్సంబంధాలకు తెరపడింది. ఇదే సమయంలో కాలి మడమకు గాయం కావడంతో, న్యూజిలాండ్ టూర్‌కు ఆమె దూరమైంది. ఇలావుంటే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తనకు విశ్రాంతి అవసరమని హర్మన్‌ప్రీత్ ప్రకటించింది. ఎంతకాలం అనేది తాను ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతానికి నిరవధికంగా విశ్రాంతి తీసుకుంటానని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది.