క్రీడాభూమి

గాడిలో పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 24: అస్తవ్యస్తంగా ఉన్న శ్రీలంక ఆటతీరు గాడిలో పడాల్సిన అవసరం ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ సుమార సంగక్కర హితవు పలికాడు. శుక్రవారం ఆయన లార్డ్స్ స్టేడియంలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుత కెప్టెన్ దిముత్ కరుణరత్నేపై ఒత్తిడి లేకపోవడం హర్షణీయమని వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన శ్రీలంక, ఇటీవల ఆడిన తొమ్మిది వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఎనిమిది పరాజయాలు ఎదుర్కొంది. వర్షం కారణంగా ప్రభావితమైన ఓ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను ఓడించగలిగింది. స్కాట్‌లాండ్‌కు టెస్టు హోదా లేదు. వరల్డ్ కప్ టోర్నీకి అర్హత కూడా సంపాదించలేదు. అలాంటి జట్టుపై సాధించిన విజయంతో లంకకు ఒరిగేది ఏమీ లేదని సంగక్కర స్పష్టం చేశాడు. నిలకడలేమి జట్టును తీవ్రంగా వేధిస్తున్నదని, ఈ తీరు నుంచి లంక జట్టు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని అన్నాడు. జట్టుకు ఆటగాళ్ల ఎంపిక నుంచి మొదలుకొని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం వరకూ అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయని సంగక్కర పరోక్షంగా జాతీయ సెలక్షన్ కమిటీపై విమర్శలు కురిపించాడు. 1996లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న శ్రీలంక మరోసారి అలాంటి సామర్థ్యానే్న ప్రదర్శించాలంటే, టోర్నీ ఆరంభం నుంచే, ప్రతి మ్యాచ్‌నీ ఒక ఫైనల్‌గా ఆడాలని స్పష్టం చేశారు. జట్టులో తరచూ మార్పులు చేయడం, దీనితో బ్యాటింగ్ ఆర్డర్‌తోపాటు బౌలింగ్ విభాగంలోనూ సమస్యలు తలెత్తుతాయని, జట్టు కూర్పు అస్తవ్యస్తంగా మారుతుందని సంగక్కర ఆందోళన వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతి ఆటగాడు తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకే ప్రయత్నించాల్సి వస్తున్నదని, దీనితో జట్టు వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయలేకపోతున్నాడని 2007, 2011 సంవత్సరాల్లో ఫైనల్ వరకూ చేరిన లంక జట్టులో సభ్యుడిగా ఉన్న సంగక్కర అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కరుణరత్నే సమర్థుడైన ఆటగాడని, గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడని చెప్పాడు. రెండు బంతులు వినియోగిస్తున్న నేపథ్యంలో, బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా, ఆచితూచి ఆడాలని చెప్పాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలదొక్కుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశాడు. ప్రస్తుతం లంకను ఎవరూ ఫేవరిట్‌గా పేర్కోవడం లేదని, కాబట్టి ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని సంగక్కర అన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వరల్డ్ కప్‌లో రాణించాలని సూచించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డి, పోరాడి విజయాలు సాధించాలని పిలుపునిచ్చాడు.