క్రీడాభూమి

వివాదాల ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, శ్రీలంక, పాకిస్తాన్ కలిసి ఆతిథ్యమిచ్చిన 2011 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. అసలు టాసే వివాదానికి కారణమైం ది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో టాస్ వేసినప్పుడు, శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర ‘హెడ్స్’ అన్నాడు. చాలా నెమ్మడిగా చెప్పడంతో, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ఎవరికీ అతను ఏది ఎంచుకున్నాడో వినిపించలేదు. తాను హెడ్స్ అన్నానని, కాయిన్ హెడ్సే పడిందని ధోనీ స్పష్టం చేయగా, సంగక్కర విభేదించాడు. దీంతో జెఫ్ క్రో మరోసారి టాస్ వేశాడు. సంగక్కర హెడ్స్ అనడం, కాయిన్ హెడ్స్‌గానే పడడంతో వివాదానికి తెరపడింది. ఒకవేళ హెడ్స్ కాకుండా టెయిల్స్ పడివుంటే, ఎలాంటి వివాదానికి దారితీసేదో!