క్రీడాభూమి

కివీస్ చేతిలో భారత్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 26: కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తొలుత పేసర్ల స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన బ్యాట్స్‌మెన్ ఆతర్వాత స్పిన్నర్లను కూడా మిగతా వారు సరిగ్గా ఆడలేకపోయారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య 30, రవీంద్ర జడేజా 54 చొప్పున పరుగులు చేసి, జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, మిగతా వారంతా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. ఎక్‌స్ట్రాల రూపంలో లభించిన 24 పరుగులదే భారత స్కోరుబోర్డులో మూడో అత్యధిక స్కోరు. 40 ఓవర్లు కూడా ఆడలేకపోయిన టీమిండియా 179 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ 8 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను కొలిన్ మున్రో రూపంలో చేజార్చుకుంది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 22 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వెనుదిరిగాడు. అయతే, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 67, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 75 పరుగులు చేసి, ఎలాంటి స మస్య లేకుండా జట్టు విజయానికి తోడ్పడ్డారు. 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసిన కివీస్ 6 వికెట్లతో గెలిచింది. అన్ని విభాగాల్లోనూ భారత్ దారుణంగా విఫలమైంది.
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బీ ట్రెంట్ బౌల్ట్ 2, శిఖర్ ధావన్ సీ టామ్ బ్లండెల్ బీ ట్రెంట్ బౌల్ట్ 2, విరాట్ కోహ్లీ బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్, లోకేష్ రాహుల్ బీ ట్రెంట్ బౌల్ట్ 6, హార్దిక్ పాండ్య సీ టామ్ బ్లండెల్ బీ జేమ్స్ నీషమ్ 30, మహేంద్ర సింగ్ ధోనీ సీ జేమ్స్ నీషమ్ బీ టిమ్ సౌథీ 17, దినేష్ కార్తీక్ సీ ఇష్ సోధీ బీ జేమ్స్ నీషమ్, రవీంద్ర జడేజా సీ మార్టిన్ గుప్టిల్ బీ లాకీ ఫెర్గూసన్ 54, భువనేశ్వర్ కుమార్ సీ రాస్ టేలర్ బీ జేమ్స్ నీషమ్ 1, కుల్దీప్ యాదవ్ సీ అండ్ బీ ట్రెంట్ బౌల్ట్ 19, మహమ్మద్ షమీ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 24, మొత్తం (39.2 ఓవర్లలో ఆలౌట్) 179.
వికెట్ల పతనం: 1-3, 2-10, 3-24, 4-39, 5-77, 6-81, 7-91, 8-115, 9-177, 10-179.
బౌలింగ్: టిమ్ సౌథీ 7-0-26-1, ట్రెంట్ బౌల్ట్ 6.2-1-4, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 6-0-12-1, లాకీ ఫెర్గూసన్ 8-0-33-1, జేమ్స్ నీషమ్ 6-1-26-3, మిచెల్ సాంట్నర్ 3-0-19-0, ఇష్ సోధీ 3-0-18-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ సీ లోకేష్ రాహుల్ బీ హార్దిక్ పాండ్య 22, కొలిన్ మున్రో ఎల్‌బీ జస్‌ప్రీత్ బుమ్రా 4, కేన్ విలియమ్‌సన్ సీ రోహిత్ శర్మ బీ యుజువేంద్ర చాహల్ 67, రాస్ టేలర్ సీ విరాట్ కోహ్లీ బీ రవీంద్ర జడేజా 75, హెన్రీ నికోలస్ 15 నాటౌట్, టాల్ బ్లండెల్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (37.1 ఓవర్లలో 4 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1-8, 2-37, 3-151, 4-179.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-27-0, జస్‌ప్రీత్ బుమ్రా 4-2-2-1, మహమ్మద్ షమీ 4-0-16-0, హార్దిక్ పాండ్య 4-0- 26-1, యుజువేంద్ర చాహల్ 6-0-37-1, కుల్దీప్ యాదవ్ 8.1-0-44-0, రవీంద్ర జడేజా 7-0-27-0.