క్రీడాభూమి

జొకోవిచ్ గెలిస్తే రికార్డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 25: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆదివారం నుం చి రొలాండ్ గారోస్‌లో ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధిస్తే, కొత్త రికార్డు నెలకొల్పుతాడు. ఈ పోటీలు ఓపెన్ టోర్నీగా మారిన తర్వాత, రాడ్ లీవర్ మాత్రమే ఒకేసారి నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను రెండు పర్యాయాలు కలిగివున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 1962 లో ఒకసారి, 1969లో మరోసారి అతని ఖాతా లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు చేరాయి. జొకోవిచ్ 2016లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెల్చుకున్నప్పుడు, అతని వద్ద యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు కూడా ఉన్నా యి. కాగా, గత ఏడాది, చివరి రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలు వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌ను అతను గెల్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ విజయభేరి మోగించాడు. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టే సమయానికి అతని వద్ద ఈ మూడు టైటిళ్లు ఉన్నాయి. ఒకవేళ రొలాండ్ గారోస్‌లో నూ గెలిస్తే, అతను నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను రెండు పర్యాయాలు కలిగివున్న ఆటగాడిగా రాడ్ లీవర్ సరసన చోటు సంపాదిస్తాడు. ఫ్రెంచ్ చాంపియన్‌షిప్ ‘ఓపెన్’గా మారక ముందు, 1930 దశకంలో డాన్ బడ్జ్ నాలుగు టైటిళ్లనూ రెండేసి పర్యాయాలు సాధించాడు. కానీ, అప్పట్లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ గ్రాండ్ శ్లామ్‌గా మారలేదుకాబట్టి, రాడ్ లీవర్ రికార్డు జాబితాలో అతని పేరును చేర్చలేదు. ఇలావుంటే, కెరీర్‌లో అత్యధికంగా 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయభేరి మోగించిన డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ నుంచి జొకోవిచ్‌కు గట్టిపోటీ తప్పకపోవచ్చు. సీనియర్ ఆటగాడు, చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ నుంచి కూడా జొకోవిచ్‌కు ప్రమాదం పొంచి ఉంది. జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్, నాలుగో సీడ్ డామినిక్ థియే మ్ కూడా టైటిల్‌పై కనే్నశారు. వీరిలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే, క్రీడా పండితుల అంచనాల ప్రకారం నాదల్, జొకోవిచ్, ఫెదరర్ మధ్యే పోటీ ఉంటుంది.
మహిళల విభాగంలో ‘ఓపెన్’
పురుషుల విభాగంలో మాదిరి మహిళల్లో ఇద్దరుముగ్గురు పేర్లను ఫేవరిట్స్‌గా పేర్కొనే అవకాశం లేదు. డిఫెండింగ్ చాంపియ న్ సిమోనా హాలెప్ ఎంత వరకూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందన్నది అనుమానమే. సెరెనా విలియమ్స్ 2017లో ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్న తర్వా త, కుమార్తెకు జన్మనిచ్చింది. ఆతర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నది. ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఈ సారి బరిలోకి దిగుతుందా? లేదా? అన్నది కూడా డౌటే. సెరెనా ఫామ్ కోల్పోయిన తర్వా త, ఇంత వరకూ ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రీడాకారిణి రాలేదు. దీనితో, ఈసారి ఫేవరిట్ ఎవరన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్ర పంచ నంబర్ వన్, టాప్ సీడ్ నవోమీ ఒసాకా, రెండో ర్యాంకర్ కరోలినా ప్లిస్కోవా కూడా టైటిల్‌ను ఆశిస్తున్నారు. అయితే, నిలకడలేమి వీరిద్దరినీ వేధిస్తున్నది. హాలెప్ మళ్లీ ఫామ్‌లోకి వ స్తుందా? లేదా? అనేది చూడాలి. కికీ బెర్టెన్స్, ఏంజెలిక్ కెర్బర్, పెట్రా క్విటోవా, స్లొయేన్ స్టెఫె న్స్, ఎలినా స్విటోలినా, ఆష్లే బార్టీ వంటి క్రీడాకారిణులు సైతం ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను ఎవరు గెల్చుకుంటారనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీనితో పోటీ ‘ఓపెన్’గా మారిపోయింది.