క్రీడాభూమి

ఫ్రాక్చర్ కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 25: భారత యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ చేతికి ఫ్రాక్చర్ కాలేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అతని కుడి చేతికి వాపు ఉందని, అయితే, ఫ్రాక్చర్ కాలేదని ఎక్స్‌రేలో స్పష్టమైందని వివరించింది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, నెట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతి శంకర్ మోచేయి, అరచేయి మధ్య భాగంలో బలంగా తలిగింది. దీనితో వెంటనే అతనికి వైద్య పరీక్షలు జరిపించారు. ఎముక చిట్లలేదన్న సమాచారంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. న్యూజిలాండ్‌తో శనివారం నాటి వామప్ మ్యాచ్‌లో ఆడని అతను కార్డ్ఫిలో ఈనెల 28న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లేదని సమాచారం. వాపు పూర్తగా తగ్గాలంటే, విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని తెలిసింది. కాగా, గాయం బలమైనది కాకపోవడంతో, కివీస్‌తో వామప్ మ్యాచ్‌కి ముందు అతను కొంత సేపు నెట్స్‌కు హాజరయ్యాడు. పూర్తి స్థాయి బ్యాటింగ్ చేయకుండా, కొద్దిసేపు వామప్‌తో ముగించాడు.