క్రీడాభూమి

వర్షంతో వామప్ మ్యాచ్‌లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, మే 26: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ లో భాగంగా ఆదివారం జరగాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు రద్దయ్యాయ. వెస్టిండీస్‌పై దక్షి ణాఫ్రికా 12.4 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 95 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడం తో ఆటను రద్దు చేశారు. కాగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల వామప్ మ్యాచ్ కూడా రద్దయింది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో, టాస్ వేయడానికి కూడా వీల్లేకపోయింది. వర్షం తగ్గితే, ఓవర్లను కుదించి మ్యాచ్‌ని ఆడించాలనుకున్న అంపైర్లు, నిర్వాహకుల ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకీ వర్షం తగ్గకపోగా, ఔట్ ఫీల్డ్ కూడా బురదమయం కావడంతో, మ్యాచ్‌ని రద్దు చేయక తప్పలేదు.