క్రీడాభూమి

ఉబెర్ కప్ బాడ్మింటన్ క్వార్టర్స్ దిశగా సైనా సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్హాన్ (చైనా), మే 17: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్ దిశగా మరో
అడుగు ముందుకే
సింది.
అయితే, థామస్ కప్ కోసం జరిగే పురుషుల టీం ఈవెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. వరుసగా రెండో రోజు కూడా పరాజయాలను చవిచూసిన భారత పురుషుల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఉదయం థామస్ కప్ మ్యాచ్‌లు జరిగాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న అజయ్ జయరామ్ ఎంత కష్టపడినప్పటికీ 11వ ర్యాంకర్ ఇంగ్ కా లాంగ్ ఆంగస్‌ను నిలువరించలేకపోయాడు. 13-21, 12-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడంతో హాంకాంగ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. డబుల్స్ విభాగం మొదటి మ్యాచ్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి పోటీపడ్డారు. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన వీరు 12-21, 19-21 తేడాతో ఆర్ చిన్ చంగ్, తాంగ్ చున్ మన్ జోడీ చేతిలో ఓడారు. ఫలితంగా హాంకాంగ్ ఆధిక్యం 2-0కు చేరింది. అయితే, రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 23-21, 23-21 స్కోరుతో అతి కష్టం మీద హు యున్‌పై విజయాన్ని నమోదు చేసి హాంకాంగ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. అయితే, రెండో డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 10-21, 11-21 తేడాతో టిజ్ కిట్ చాన్, చెయుక్ హిమ్ లా జోడీ చేతిలో ఓడడంతో హాంకాంగ్ 3-1 తేడాతో విజయభేరి మోగించింది. ఎలాంటి ప్రాధాన్యం లేని చివరి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 17-21, 21-19, 21-9 ఆధిక్యంతో నాన్ వెయ్‌పై గెలిచాడు. భారత్ రెండో విజయాన్ని సాధించినప్పటికీ హాంకాంగ్ చేతిలో 2-3 తేడాతో ఓడింది. ఈ టోర్నీ మొదటి రోజు థాయిలాండ్‌ను ఢీకొన్న భారత్ ఇదే తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు వరుస పరాజయాలు భారత్‌ను టోర్నీలో రేసు నుంచి తప్పించాయి.
మహిళల ముందంజ
థామస్ కప్ పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైనప్పటికీ, ఉబెర్ కప్‌లో మహిళలు ముందంజ వేసి, అభిమానులకు ఊరటనిచ్చారు. మొదటి మ్యాచ్‌లో భారత స్టార్, నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 21-15, 21-10 తేడాతో ఫబినే డిప్రెజ్‌ను చిత్తుచేసింది. ఆమె విజృంభణకు ప్రత్యర్థి నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. మరో సింగిల్స్‌లో తెలుగు తేజం పివి సింధు 21-7, 21-12 స్కోరుతో లూసీ హెమ్‌పై విజయభేరి మోగించింది. డబుల్స్ విభాగం తొలి మ్యాచ్‌లో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప 14-21, 21-9, 21-8 స్కోరుతో గెలవడంతో జర్మనీపై భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. దీనితో చివరి రెండు మ్యాచ్‌లకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. ఆ మ్యాచ్‌లోనూ భారత్ సత్తా చాటి, క్వార్టర్స్ చేరుకునే అవకాశాలను మెరుగు పరచుకుంది. రుత్విక శివానీ 21-5, 21-15 తేడాతో యూనే లీని చిత్తుచేస్తే, సిక్కీ రెడ్డి/ పివి సింధు జోడీ 21-18, 19-21, 22-20 స్కోరుతో
ఇసాబెల్
హెర్టిచ్, ఫ్రాంజిస్కా వోక్ జోడీపై గెలిచింది. సోమవారం ఆస్ట్రేలియాను 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన భారత్ మంగళవారం జర్మనీని కూడా అదే తేడాతో ఓడించి, టైటిల్ రేసులో ఉన్నానని ప్రత్యర్థి జట్లకు
సంకేతాలు పంపింది.