క్రీడాభూమి

ట్రోఫీని ఊహించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 26: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి 1983లో కైవసం చేసుకుంది. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానుల విషయం ఏమోగానీ, తాము మాత్రం ట్రోఫీని సొంతం చేసుకుంటామని ఊహించలేదని అప్పటి విజేత జట్టు సభ్యుడు, డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఇక్కడ ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, అంతకు ముందు రెండు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌లో తాము తూర్పు ఆఫ్రికాను తప్ప మరే ఇతర జట్టునూ ఓడించలేదని అన్నాడు. చివరికి, అప్పట్లో టెస్టు హోదాలేని శ్రీలంక చేతిలోనూ భారత జట్టు పరాజయాన్ని ఎదుర్కొందన్నాడు. దీనితో, మూడో వరల్డ్ కప్‌లోనూ అందరి కంటే ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తామని అనుకున్నట్టు చెప్పాడు. అయితే, జట్టు కెప్టెన్ కపిల్ మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, అతని మనోనిబ్బరమే తమను కూడా ప్రభావితం చేసిందని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లే ముందు, విండీస్‌ను ఒక మ్యాచ్‌లో ఓడించామని చెప్పాడు. ‘ఒకసారి విండీస్‌పై గెలిచాం. మరోమారు ఎందుకు గెలవలేం? అంటూ కపిల్ మమ్మల్ని ప్రశ్నించాడు. అప్పుడుగానీ జట్టులోని ఆటగాళ్లలో చలనం రాలేదు. కపిల్ వాదన నిజమే అనిపించింది. అందరిలోనూ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే, కపిల్ స్ఫూర్తిదాయకమైన నాయకత్వమే భారత్‌కు టైటిల్‌ను సాధించిపెట్టింది’ అన్నాడు. నిజానికి తాను ముంబయి నుంచి న్యూయార్క్‌కు ప్రయాణం పెట్టుకున్నానని, లండన్‌లో కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నానని చెప్పాడు. వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తే, అక్కడి నుంచి నేరుగా న్యూయార్క్ వెళ్లిపోవాలన్నదే తన ప్రణాళికలో భాగమని అన్నాడు. కానీ, ఎవరూ, చివరికి తాము కూడా ఊహించని రీతిలో ఆడి, విజేతగా నిలిచామని శ్రీకాంత్ అప్పటి తన అనుభవాలను పంచుకున్నాడు. జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 (నాటౌట్) స్కోరును వరల్డ్ కప్ టోర్నీల్లోనే అతి ప్రత్యేకమైనదని అన్నాడు. పచ్చిక ఎక్కువగా ఉన్న పిచ్‌పై గవాస్కర్‌తోపాటు తాను కూడా సున్నాకే ఔటైన విషయాన్ని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాడు. ఒకానొ దశలో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న జట్టును కపిల్ తన అసాధారణ ప్రతిభతో గెలిపించాడని శ్రీకాంత్ తెలిపారు. ఆతర్వాత ఎలాంటి మ్యాచ్‌నైనా గెలవగలమన్న ధీమా జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ కనిపించిందన్నాడు. చివరికి ఆ ధీమానే జట్టుకు ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిందని శ్రీకాంత్ వివరించాడు.