క్రీడాభూమి

తెలంగాణ సమియాకు బాడ్మింటన్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తచెన్నై, మే 26: జాతీయ బాడ్మింటన్ అండర్-19 బాలికల విభాగం లో తెలంగాణకు చెందిన సమియా ఇమాద్ ఫరూఖీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆసియా అండర్-15 చాంపియన్ సమియా బాలికల ఫైనల్లో ఢిల్లీ క్రీడాకారిణి, 16వ సీడ్ ఆషీ రావత్‌ను 21-17, 21-17 తేడాతో ఓడించింది. సమియాను నిలువరించడానికి ఆషీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమియా జూనియర్స్ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నది. కాగా, బాలుర సింగిల్స్‌లో మైస్నమ్ మెరబా టైటిల్ సాధించాడు. ఈ మణిపూర్ క్రీడాకారుడు ఫైనల్లో ఢిల్లీకి చెందిన ఆకాష్ యాదవ్‌ను ఢీకొని, మొదటి సెట్‌ను 21-9 తేడాతో సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో 12-7 ఆధిక్యంతో ముందంజలో ఉన్న సమయంలో ప్రత్యర్థి యాదవ్ ఫిట్నెస్ సమస్య కారణంగా పోటీ నుంచి వైదొలిగాడు. దీనితో మైస్నమ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించాడు.