క్రీడాభూమి

ఐదో సీడ్ కెర్బర్‌కు పొటపొవా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించే సత్తా ఉన్న క్రీడాకారిణుల్లో చోటు సంపాదించిన ఐదో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనస్తాసియా పొటపొవా (రష్యా) ఆమెను 6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది. మొదటి సెట్‌లో కొంత వరకూ పోరాడిన కెర్బర్ రెండో సెట్‌లో ఆ మాత్రం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఇలావుంటే, మరో మ్యాచ్‌లో 19వ సీడ్ గార్బినె ముగురుజా 5-7, 6-1, 6-2 స్కోరుతో టేలర్ టౌనె్సంట్‌పై విజయం నమోదు చేసి, రెండో రౌండ్ చేరింది. జొహన్నా లాసన్ 6-3, 6-4 తేడాతో మగ్దలెన రిబరికొవాను, పెట్రా మాట్రిక్ 6-1, 6-2 ఆధిక్యంతో ఒన్స్ జబెర్‌ను ఓడించారు.
సిలిక్ శుభారంభం
పురుషుల సింగిల్స్‌ల 11వ సీడ్ మారిన్ సిలిక్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో అతను థామస్ ఫాబియానోను 6-3, 7-5, 6-1 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో అలెక్సియో పొపిరిన్ 3-6, 6-3, 7-6, 6-3 ఆధిక్యంతో యుగో హంబర్ట్‌పై విజయం సాధించాడు. కాస్పర్ రాల్ 6-2, 7-6, 6-0 తేడాతో ఎర్నెస్ట్స్ గల్బిస్‌పై గెలుపొంది, రెండో రౌండ్ చేరాడు.