క్రీడాభూమి

ఇండియాను ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 26: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంత వరకూ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు ఈసారి ఎదురుదాడికి దిగుతుందని మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ జోస్యం చెప్పాడు. పాక్ జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న అతను ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను తమ జట్టు ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని అన్నాడు. వరల్డ్ కప్ అంటే కేవలం భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదని వ్యాఖ్యానించాడు. ఇతర జట్లను కూడా ఓడించే సత్తా పాక్‌కు ఉందని అన్నాడు. వనే్డల్లో పాక్ వరుసగా 10 మ్యాచ్‌లను చేజార్చుకోవడం, వరల్డ్ కప్ వామప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలోనూ ఓడడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, గతాన్ని వదిలేసి, ఎప్పటికప్పుడు కొత్తగా టోర్నీలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నాడు. మహమ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ షిన్వారీ వంటి మేటి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారని, ఇంగ్లాండ్ పిచ్‌లపై వీరు అద్భుతంగా రాణించగలరని ఇంజమామ్ అన్నాడు. మరో ఇద్దరు పేసర్లు మహమ్మద్ హస్‌నైన్, వాహబ్ రియాజ్ ఎంపికను ఇంజీ సమర్ధించుకున్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఏ ఒక్క జట్టునూ తేలికగా తీసుకోరాదని జట్టు సభ్యులను హెచ్చరించాడు. వరల్డ్ కప్‌లో ఆడే ప్రతి జట్టూ బలమైనదేనని, ప్రతి మ్యాచ్ విలువైనదేనని ఇంజీ వ్యాఖ్యానించాడు. పాక్ కనీసం సెమీ ఫైనల్ చేరుతుందనే నమ్మకం తనకు ఉందన్నాడు. అదే విధంగా ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్ జట్లు కూడా సెమీస్ చేరే అవకాశం ఉందని ఇంజీ తెలిపాడు. ఈసారి వరల్డ్ కప్‌ను గెల్చుకునే ఫేవరిట్ జట్ల జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నాడు. పాకిస్తాన్‌కు అవకాశాలు లేకపోలేదని ఇంజమామ్ అన్నాడు.