క్రీడాభూమి

డీఆర్‌ఎస్‌ను మార్చిన అప్పీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అప్పీల్ కారణంగా డీఆర్‌ఎస్ నిబంధనల్లో మార్పులు తప్పలేదు. ఈ సంఘటన 2011 వరల్డ్ కప్‌లో చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో తలపడిన ఇంగ్లాండ్ తరఫున ఇయాన్ బెల్ క్రీజ్‌లో ఉన్నాడు. బెల్ కొట్టిన బంతి బౌండరీ దిశగా వెళ్లడంతో, సింగిల్ పూర్తి చేసిన అతను రెండో పరుగు కోసం వేగంగా వచ్చాడు. అదే సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి బెల్ ప్యాడ్స్‌కు తగిలింది. అతను స్టంప్స్‌కు అడ్డంగా వచ్చాడని, లేకపోతే బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను పెకళించి ఉండేదని పేర్కొం టూ, అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్ డిసిషన్ రి వ్యూ సిస్టం (డీఆర్‌ఎస్)కు అప్పీల్ చేశాడు. అదే విషయం రీ ప్లేలో స్ప ష్టంగా కనిపించింది. దీనిని గమనించిన బెల్ తాను ఔటైనట్టు నిర్ధారించుకొని పెవిలియన్‌పైపు అడుగులేశాడు. అయితే, అంపైర్ బిల్లీ బౌడెన్ అతడిని వెనక్కు పిలిచాడు. బంతి ప్యాడ్స్‌కు తగిలినప్పు డు అతను వికెట్ల నుంచి 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాడని, కాబట్టి, నిబంధనలను అనుసరించి ఔట్ కాదని బౌడెన్ స్పష్టం చేశాడు. అంపై ర్ నిర్ణయంపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి అప్పటి సీఈఓగా ఉన్న హరూన్ లార్గట్ దృష్టికి తీసుకెళ్లాడు. మొత్తం మీద స్టంప్స్‌కు, ఫీల్డర్‌కు బెల్ మధ్యలోకి రావడం, అప్పుడు అతను 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూ రంలో ఉన్నాడు కాబట్టి నాటౌట్ అని అంపైర్ ప్రకటించడం క్రికెట్ ప్ర పంచంలో చర్చనీయాంశాలైనాయి. ఈ అంశాన్ని పరిశీలించిన ఐసీసీ చివరికి డీఆర్‌ఎస్‌లోని నిబంధనను మార్చేసింది. ఒక బ్యాట్స్‌మన్ స్టం ప్స్‌కు 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పటికీ, అతను ఫీల్డర్‌కు అడ్డుగా వచ్చి, బంతి తగిలితే ఔటైనట్టేనని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాట్స్‌మన్‌కు తగలకపోతే, బంతి నేరుగా స్టంప్స్‌కు తగిలేదని స్పష్టమైతే, సదరు బ్యాట్స్‌మన్ ఎంత దూరంలో ఉన్నాడనే విషయం తో సంబంధం లేకుండా అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్‌గా ప్ర కటించాలంటూ నిబంధనను మార్చినట్టు ఐసీసీ ప్రకటించింది. మొ త్తం మీద భారత్ చేసిన ఫిర్యాదు ఐసీసీ నిబంధనలనే మార్చేసింది.