క్రీడాభూమి

తుది జట్టులో ఫిన్‌కు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, మే 18: ఇంగ్లీష్ కౌండీల్లో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ స్మిత్‌కు శ్రీలంకతో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో ఆడే తుది 11 మంది జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడని జేమ్ బాల్‌కు అవకాశం లభిస్తుందన్న వార్తలు వినిపించాయి. అయితే, చివరి క్షణాల్లో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకొని, ఫిన్‌ను ఎంపిక చేశారని సమాచారం. అలిస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ ఇక్కడి హెడింగ్లే మైదానంలోనే రెండేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టెస్టులో అనూహ్యంగా ఓడింది. ఇంగ్లాండ్‌పై లంకకు అదే తొలి టెస్టు సిరీస్ విజయం. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లంక 257 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 365 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక 457 పరుగులు చేసి, ఇంగ్లాండ్ ముందు 350 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు, చివరి ఓవర్‌ను షామిండ ఎరాంగ వేయగా, జేమ్స్ ఆండర్సన్ క్రీజ్‌లో ఉన్నాడు. అతను అప్పటికి 50 బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండా లంక బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు మోయిన్ అలీ 108 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఎరాంగ వేసిన మొదటి నాలుగు బంతులను కూడా ఆండర్సన్ రక్షణాత్మకంగా ఆడాడు. మరో రెండు బంతులు అతను అదే విధంగా ఆడి ఉంటే రెండో టెస్టుతోపాటు సిరీస్ కూడా డ్రా అయ్యేది. కానీ, ఎరాంగ వేసిన ఐదో బంతి ఆండర్సన్ బ్యాట్‌కు తగులుతూ దూసుకెళ్లగా, రంగన హెరాత్ చక్కటి క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. 249 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో ధమ్మిక ప్రసాద్ 50 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, లంక విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. కాగా, అదే ఫలితాన్ని హెడింగ్లే మైదానంలో పునరావృతం చేయాలని లంక పట్టుదలతో ఉండగా, ప్రతీకారం కోసం ఇంగ్లాండ్ కాపుకాసింది. అప్పటి మ్యాచ్‌లో కీలక బౌలర్ ప్రసాద్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుమార సంగక్కర, మహేల జయవర్ధనే వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ పరిస్థితిల్లో గతంలో మాదిరి పటిష్టంగా లేని లంక గెలవడం కష్టమే.