క్రీడాభూమి

మళ్లీ ఆడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూన్ 6: సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్ ఇది వరకే మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌లో వచ్చిన సమాచారం ప్రకారం, అంతర్జాతీయ కెరీర్‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను పక్కకుపెట్టి, మళ్లీ క్రికెడ్ ఆడతానని, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీ కోసం జట్టు ఎంపిక జరగడానికి ఒక రోజు ముందు అతను స్పష్టం చేశాడు. అయితే, అతని ప్రతిపాదనను క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) నిరాకరించింది. జట్టు మేనేజ్‌మెంట్ సైతం అతనిని తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లను కోల్పోయిన నేపథ్యంలో, డివిలియర్స్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొన్న దక్షిణాఫ్రికా ఏకంగా 104 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. అనంతరం, బంగ్లాదేశ్‌పై విజయం సాధించి మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని అంతా ఊహించారు. కానీ, ఆ మ్యాచ్‌ని 21 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ముచ్చటగా మూడో పరాజయం భారత్ చేతిలో ఎదురైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఈ వరుస పరాజయాలు సౌతాఫ్రికా అభిమానులను నిరాశ పరచగా, డివిలియర్స్ ప్రతిపాదన సమాచారం వెలుగుచూడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తావున్న డివిలియర్స్ వంటి ఆటగాడిని ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు పొరపాటు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచ కప్ టోర్నీలో డివిలియర్స్ 63.52 సగటుతో 1,207 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో నాలుగు శతకాలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. 2015 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్‌లో 31 బంతుల్లోనే సెంచరీ చేసి, అతను నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. వనే్డ కెరీర్‌లో 53.50 సగటుతో 9,577 పరుగులు చేసిన డివిలియర్స్‌కు దక్షిణాఫ్రికాలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచ కప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం డివిలియర్స్ ఇంటర్నేషల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ఎంపికకు ముందు తన మనసు మార్చుకున్నాడు. మళ్లీ క్రికెడ్ ఆడేందుకు సిద్ధమని, తన పేరును పరిశీలించాలని సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొన్డీకి సందేశం పంపాడు. కానీ, జొన్డీతోపాటు జట్టు కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్, హెడ్ కోచ్ ఒటిస్ గిబ్సన్ కూడా డివిలియర్స్ ప్రతిపనను తిరస్కరించారు. ఫలితంగా అతనికి జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా వరుస పరాజయాల నేపథ్యంలో, డివిలియర్స్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది.