క్రీడాభూమి

ఎదురుదాడి వారి బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయకూడదని, అనూహ్యంగా చెలరేగిపోవడం, సంచలన విజయాలు సాధించడం ఆ జట్టు సొంతమని విశే్లషకులు అంటున్నారు. ఈ విషయం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టే ముందు ఇంగ్లాండ్‌లో వాతావరణం, పిచ్‌ల తీరు తెలుసుకునేందుకు పాక్ జట్టు పర్యటనకు వెళ్లింది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను చవిచూసింది. వాటిలో రెండు మ్యాచ్‌ల్లో 350కిపైగా పరుగులు సాధించింది. ఒక మ్యాచ్‌లో 340 పరుగులు చేసింది. బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో నిలకడ లోపించడమే పాక్ ఓటమికి ప్రధాన కారణం. కాగా, వరల్డ్ కప్‌లో భాగంగా తన మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్‌తో ఆడింది. ఎవరూ ఊహించని రీతిలో ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు గట్టిపోటీనిచ్చినా ఫలితం లేకపోయంది. పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదనడానికి ఈ మ్యాచ్‌లే తార్కాణం. హఠాత్తుగా విజృంభించడం, అదే స్థాయలో, ఎవరూ ఊహించని విధంగా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. అందుకే, లంకతో జరగబోయే మ్యాచ్ ఫలితాన్ని ఊహించడం అసాధ్యంగా మారింది.
*
బ్రిస్టల్, జూన్ 6: పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. రెండు జట్లలోనూ పోరాట యోధులు ఉన్నారు. పరాజయం ఎదురైతే కుంగిపోకుండా, ఎదురుదాడికి దిగడమే వారి బలం. అనూహ్య విజయాలు సాధించడం వారి నైజం. అందుకే, పట్టుదలకు మారుపేరుగా నిలుస్తారు. కాబట్టే, ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం జరిగే వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్ ఆసక్తి రేపుతున్నది. ఈ రెండు జట్లూ తమతమ మొదటి మ్యాచ్‌లను చేజార్చుకున్నాయి. రెండో మ్యాచ్‌లను తమతమ ఖాతాల్లో వేసుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో మ్యాచ్‌లో పరస్పరం ఢీ కొంటున్నాయి. నిజానికి పాక్ తన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చావు దెబ్బతిన్న విధానం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 21.4 ఓవర్లు మాత్రమే ఆడి, కేవలం 105 పరుగులకే పాక్ కుప్పకూలింది. ఆతర్వాత వెస్టిండీస్ 13.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 108 పరుగులు సాధించి, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అయితే, రెండో మ్యాచ్‌లో టైటిల్ ఫేవరిట్ ఇంగ్లాండ్‌నే ఓడించి సత్తా చాటింది. ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ బలాన్ని నిరూపించుకుంటూ పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు సాధించింది. బాబర్ ఆజమ్ (63), మహమ్మద్ హఫీజ్ (84), షాబాజ్ అహ్మద్ (55) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 44 పరుగులు చేశాడు. అనంతరం పాక్ బౌలర్లు వ్యూహాత్మకమైన ఆటతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. జో రూట్ (107), జొస్ బట్లర్ (103) శతకాలు నమోదు చేసినప్పటికీ, తమ వంతు ప్రయత్నాన్ని విరమింకుండా, చివరి వరకూ సర్వశక్తులు ఒడ్డి బౌలింగ్ చేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు చేజార్చుకొని, 334 పరుగులు చేయగలిగింది. పాక్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాహబ్ రియాజ్ మూడు వికెట్లు పడగొడితే, షాదాబ్ ఖాన్, మహమ్మద్ అమీర్ చెరి రెండు వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పాక్ ఇప్పుడు బలమైన జట్లకు సవాళ్లు విసురుతున్నది. వరల్డ్ కప్ టోర్నీకి ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో 0-4 తేడాతో పాక్ పరాజయాన్ని ఎదుర్కొంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. లేకపోతే, అందులోనూ ఓడేదనడంలో అనుమానం లేదు. ఆ వైఫల్యాలను కొనసాగిస్తూ, వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌ని కోల్పోయింది. కానీ, పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఓడించిన తీరు పాక్ పోరాటతత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఒత్తిడికి గురికాకుండా, చివరి వరకూ పోరాడాలన్న పాక్ ఆటగాళ్ల స్ఫూర్తి, మిగతా జట్లకు మార్గదర్శకం కావాలి. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన జట్టును ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ మాదిరిగానే శ్రీలంక జట్టు కూడా నిలకడ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడి, చావుదెబ్బ తిన్నది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 29.2 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాట్స్‌మెన్ వైఫల్యాలకు ఈ స్కోరే నిదర్శనం. అనంతరం న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌పై లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా కివీస్ వికెట్ నష్టం లేకుండానే లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. అయితే, తమ రెండో మ్యాచ్‌లో లంక కోలుకుంది. అఫ్గానిస్తాన్‌ను ఎదుర్కొని, 36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బౌలర్ మహమ్మద్ నబీ 30 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మెరుగుపడనప్పటికీ, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే కొంత కోలుకున్నదని చెప్పాలి. కుశాల్ పెరెరా 78 పరుగులు సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 30 పరుగులు చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యం లంకను వెంటాడుతున్నది. కాగా, లంక బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయినా, బౌలర్లు మాత్రం తమను తాము నిరూపించుకున్నారు. సీనియర్ బౌలర్ లసిత్ మలింగ 39 పరుగులకు మూడు వికెట్లు పడగొడితే, నవాన్ ప్రదీప్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చాడు. బౌలర్లు రాణించడం లంకకు ఊరటనిస్తున్నది. బ్యాటింగ్ విభాగం కూడా పుంజుకుంటే, బలమైన ప్రత్యర్థులకు కూడా గట్టిపోటీని ఇవ్వగలదు.
ఇలావుంటే, శుక్రవారం నాటి మ్యాచ్‌లో లంకపై పాకిస్తాన్‌దే పైచేయి అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగితంపై చూస్తే, జరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ, గత మ్యాచ్‌ల్లో ఆ రెండు జట్లు ఆడిన తీరును పరిశీలిస్తే మాత్రం పాక్ వైపే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. అయితే, లంకను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని గతంలో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఆ జట్టు ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తే, వారిని అడ్డుకోవడం అనుకున్నంత సులభం కాదు. అందుకే, పోరాట యోధులుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగే యుద్ధం హోరాహోరీగా సాగడం ఖాయం.