క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల ఫైనల్‌కు బార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆష్లే బార్టీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఆమె మర్కెటా వండ్రోసొవాతో పోటీపడుతుంది. శుక్రవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్లో బార్టీ 6-7, 6-3, 6-3 తేడాతో అమందా అనిసిమోవాను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ సిమోనా హాలెప్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన అనిసిమోవా సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడును కొనసాగిస్తూ, మొదటి సెట్‌ను 7-6 తేడాతో సొంతం చేసుకుంది. కానీ, ఆతర్వాత బార్టీ కొనసాగించిన ఎదురుదాడికి నిలవలేకపోయింది. వరుసగా రెండు సెట్లను 6-3, 6-3 ఆధిక్యంతో గెల్చుకున్న బార్టీ సెమీస్ చేరింది. మరో మ్యాచ్‌లో జొహన్నా కొన్టాపై వండ్రోసొవా 7-5, 7-6 తేడాతో గెలిచింది. రెండు సెట్లలోనూ కొన్టా తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. వండ్రోసొవా వ్యూహాత్మకంగా ఆడి, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.