క్రీడాభూమి

చెత్త అంపైరింగ్: బ్రాత్‌వెయిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 7: ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లో అంపైరింగ్ నాసిరకంగా ఉందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కోవడానికి అంపైరింగ్ పొరపాట్లే కారణమని చెప్పలేనని, అయితే, అది కూడా ఒక కారణమని విలేఖరులతో మాట్లాడుతూ బ్రాత్‌వెయిట్ అన్నాడు. ఓపెనర్ క్రిస్ గేల్‌ను, కెప్టెన్ జాసన్ హోల్డర్‌ను ఔట్‌గా ప్రకటించారని, కానీ, ఆ రెండు సందర్భాల్లోనూ డీఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయగా, రీ ప్లేలో నాటౌట్ అని తేలిందని బ్రాత్‌వెయిట్ చెప్పాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఒక బంతిని క్రీజ్ వెలుపల కాలుపెట్టి వేశాడని అన్నాడు. అయితే, అంపైర్ క్రిస్ గాఫనీ (న్యూజిలాండ్) నోబాల్‌ను ప్రకటించలేదు. ఆతర్వాతి బంతికే గేల్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ అంశాన్ని బ్రాత్‌వెయిట్ ప్రస్తావిస్తూ, ఒకవేళ అంపైర్ నోబాల్‌ను ప్రకటించి ఉంటే, ఆతర్వాతి బంతి ‘ఫ్రీ హిట్’గా ఉండేదని, గేల్ వికెట్‌ను కోల్పోయేవాళ్లం కాదని అన్నాడు. ఫీల్డ్ అంపైర్లు గాఫనీ, రుచిర పలియగురుగే (శ్రీలంక) ఉత్తమ అంపైరింగ్‌కు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అంటూనే, వారి పొరపాటు నిర్ణయాలు తమ పరాజయానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించాడు. ‘బంతి మా బ్యాట్స్‌మన్ కాలికి తగిలిన ప్రతిసారీ అంపైర్ చేయి గాల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితి సహజంగానే డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆసీస్ చేతిలో మా ఓటమికి అంపైరింగ్ పొరపాట్లు మాత్రమే కారణం కాదు. నిజమే. కానీ, ఆ పొరపాట్ల వల్ల జట్టు తీవ్రమైన ఒత్తిడికి గురైంది. గేల్ లాంటి ఆటగాడు క్రీజ్‌లో నిలబడి ఉంటే, మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది’ అన్నాడు. కాగా. అంపైరింగ్ చాలా దారుణంగా ఉందని విండీస్ మాజీ పేసర్ మైఖేల్ హోల్డింగ్ మండిపడ్డాడు.