క్రీడాభూమి

షాజాద్‌కు గాయం వరల్డ్ కప్ టోర్నీకి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 7: అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ షెజాద్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతను ఈ పోటీల్లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో ఇక్రామ్ అలీ ఖిల్ జట్టులో చేర్చుకోవడానికి అనుమతించినట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో అతను ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే, పరుగుల ఖాతా తెరవకుండానే 32 ఏళ్ల షాజాద్ నిష్క్రమించాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి రెండు బంతులను రక్షణాత్మకంగా ఆడిన అతను మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొని, 7 పరుగులు చేసి, లసిత్ మలింగ బౌలింగ్‌లో దిముత్ కరుణరత్నేకు దొరికిపోయాడు. వరల్డ్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌తో వామప్ మ్యాచ్‌లో పాల్గొన్నప్పుడే షేజాద్ మోకాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత అతను మ్యాచ్‌లకు సిద్ధమయ్యాడు. రెండు మ్యాచ్‌ల తర్వాత మరోసారి కాలి నొప్పి పెరగడంతో, వైద్య సేవలు అత్యవసరమయ్యాయి. షెజాద్‌ను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని స్పష్టం చేయడంతో, అతనిని స్వదేశానికి పంపేందుకు అఫ్గాన్ మేనేజ్‌మెంట్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించి, అనుమతించామని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. నిబంధనలను అనుసరించి, ఒక ఆటగాడు గాయపడి, టోర్నీలో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో మరో ఆటగాడిని చేర్చుకునే అవకాశం ఉందని వివరించింది. ఈ నిబంధన ప్రకారమే అలీ ఖిల్‌ను జట్టులో చేర్చుకునే వీలు కల్పించామని ఐసీసీ తెలిపింది. ఇలా వుంటే, విజయం కోసం ఎదురుచూస్తున్న అఫ్గా న్‌కు షాజాద్ లేకపోవడాన్ని ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఆ జట్టు టోర్నీలో ఎంత వరకూ ముం దంజ వేస్తుందన్నది అనుమానంగానే ఉంది.