క్రీడాభూమి

ప్రాక్టీస్ సెషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 7: భారీ వర్షం కారణంగా శుక్రవారం నాటి టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం డిఫెండింగ్ చాంపియన్, టైటిల్ ఫేవరిట్ ఆస్ట్రేలియాను ఢీకొననుంది. సౌతాంప్టన్ నుంచి కోహ్లీ సేన గురువారం లండన్ చేరుకుంది. అక్కడ టోర్నమెంట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉండింది. కానీ, వర్షం వల్ల ఈ సెషన్ రద్దుకాగా, భారత జట్టు సభ్యులు తేలికపాటి వామప్‌తో సరిపుచ్చుకున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కి ముందు కూడా వర్షం వల్ల టీమిండియా సభ్యులు ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఆ మ్యాచ్‌ని సులభంగానే సొంతం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా రూపంలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది. భారత్‌లో పర్యటించినప్పుడు వనే్డ సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లను గెల్చుకున్న ఆసీస్ ఆ సిరీస్‌ను 3-2 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత వరుసగా మరో ఏడు విజయాలను నమోదు చేసింది. మొత్తం మీద పది వరుస విజయాలతో దూకుడుమీద ఉన్న ఆసీస్‌కు టీమిండియా ఎంత వరకు కళ్లెం వేస్తుందో చూడాలి.