క్రీడాభూమి

ఐఓసీ నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: అంతర్జాతీయ ఈవెంట్స్ ఏవీ నిర్వహించకుండా భారత్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధించిన నిషేధాన్ని ఎత్తివేయించడానికి చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై చర్చలు జరపాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజూకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనాల్సిన ఇద్దరు పాకిస్తాన్ షూటర్లకు వీసాలను భారత్ జారీ చేయలేదు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందంచిన ఐఓసీ భారత్‌పై నిషేధాన్ని విధించింది. వివిధ ఈవెంట్స్ నిర్వాహణ కోసం భారత్ చేసుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచింది. పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ షూటర్లకు వీసాలను కేంద్రం నిరాకరించగా, ఒలింపిక్ స్ఫూర్తికి ఇలాంటి చర్యలు గొడ్డలి పెట్టుగా మారతాయని ఐఓసీ వ్యాఖ్యానించింది. ఒలింపిక్ నిబంధనలను పాటించకపోతే, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఇలావుంటే,గత వారం కేంద్ర క్రీడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రిజిజూ మాట్లాడుతూ ఐఓసీ విధించిన నిషేధం ఎత్తివేతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. క్రీడాకారులు, క్రీడా సంఘాలు, సమాఖ్యలు సమష్టిగా కృషి చేసి, దేశంలో క్రీడాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. కాగా, శనివారం మంత్రి రిజిజూను కలిసిని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. నిషేధం కారణంగా దేశంలో క్రీడాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని ఐఓసీతో చర్చించాలని సూచించారు. మంత్రి తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలని మెహతా ట్వీట్ చేశారు.