క్రీడాభూమి

సెమెన్యా ఉదంతంతో తెరపైకి రష్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, జూన్ 8: డోపింగ్ ఉదంతంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరై, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రష్యా మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా స్ప్రింటర్ కాస్టర్ సెమెన్యాలో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) నిబంధనలను మార్చింది. లింగ భేదాన్ని స్పష్టం చేసే టెస్టోస్టెరోన్ మోతాదు 5వ స్థాయిని మించితే, సదరు అథ్లెట్‌ను మహిళల విభాగంలో పోటీ చేయడం నుంచి మినహాయించాలని ఐఏఏఎఫ్ తీసుకున్న నిర్ణయం గత నెల తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో సెమెన్యాను అనర్హురాలిగా ప్రకటించి, గతంలో ఆమె సొంతం చేసుకున్న ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు, ఇతర పతకాలను రద్దు చేయాలా? లేదా? అనే అంశంపై ఐఏఏఎఫ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలావుంటే, సెమెన్యా కేసులో, డోపింగ్ అంశం కూడా మళ్లీ చర్చకు వచ్చింది. దానితోపాటు రష్యా పేరు మరోసారి అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో చక్కర్లు కొడుతున్నది. రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తాను మాల్డోనియం అనే నిషిద్ధ ద్రవ్యాన్ని వినియోగించినట్టు ప్రకటించి రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన తర్వాత డోపింగ్ అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలాకాలంగా రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ నిర్ధారించింది. రష్యా అథ్లెట్లు చాలా మంది నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడుతున్నట్టు రుజువైందని వాడా చేసిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ అథ్లెటిక్స్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి పుతిన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రష్యాకు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అనర్హత వేటును ఎదుర్కోక తప్పలేదు. డోప్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సర్కారు ప్రకటిస్తుండగా, మరోవైపు ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకొస్తునే ఉన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడానికి వీలుగా అథ్లెట్లతో ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. రష్య ఎంచుకున్న అక్రమ మార్గానికి ఐఎఎఎఫ్‌లోని కొందరు మాజీ అధికారులు సహకరించారన్నది క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. విజయాలు సాధించడానికి, పతకాలను పెంచుకోవడానికి అథ్లెట్లు అడ్డదారులు తొక్కడమే అప్పటి వరకూ అందరికీ తెలుసుగానీ, ఏకంగా ఒక దేశ సర్కారే ఈ విధంగా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతుందని ఎవరికీ అనుమానం కూడా రాలేదు. రష్యా ఉదంతం క్రీడా రంగాన్ని డోపింగ్ మహమ్మారి ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదనే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. అత్యంత కీలక పరిస్థితుల్లో, ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగించే ఉత్ప్రేరకాలు క్రీడా రంగానికి శాపంగా మారాయనడానికి రష్యా డోపింగ్ వివాదాన్ని మించిన రుజువు మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా డోపింగ్ నిబంధనలను అతిక్రమిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలవడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ఇలావుంటే, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రష్యా ఇప్పటి వరకూ పది పర్యాయాలు అభ్యర్థించింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, ఐఏఏఎఫ్‌తోపాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), వాడా మాత్రం సానుకూలంగా స్పందించలేదు. వివిధ ఈవెంట్స్‌లో రష్యా అథ్లెట్లు తమ దేశం తరఫున కాకుండా ఒలింపిక్స్ పతాకం కింద పోటీపడుతున్నారు. 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఈ ఏడాది మే మాసాంతం వరకూ 74 మంది రష్యా అథ్లెట్లు వివిధ పోటీల్లో ఒలింపిక్స్ పతాకంతో బరిలోకి దిగారు. వీరిలో 68 మంది క్లీన్ చిట్ పొందగా, మిగతా ఎనిమిది మంది డోప్ పరీక్షలో పట్టుబట్టారు. దీనితో, సెమెన్యా కేసుతోపాటు, రష్యాపై ఉన్న కేసులను కూడా ఐఏఏఎఫ్ తిరగతోడుతున్నది.