క్రీడాభూమి

థీమ్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 8: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ సెమీస్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. నాలుగో సీడ్ డామినిక్ థీమ్ అతనిని మారథాన్ సెమీ ఫైనల్ పోరులో 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. మొదటి సెట్‌ను థీమ్ సులభంగానే గెల్చుకుంటే, రెండో సెట్‌లో జొకోవిచ్ అంతే తేలిగ్గా విజయం సాధించాడు. ఆతర్వాత మూడు సెట్లు హోరాహోరీగా కొనసాగాయి. గెలవాలన్న పట్టుదలతో ఇరువురు క్రీడాకారులు సర్వశక్తులు ఒడ్డడంతో పోరు ఆసక్తికరంగా మారింది. మూడో సెట్‌ను థీమ్ 7-5 ఆధిక్యంతో సొంతం చేసుకుంటే, నాలుగో సెట్‌లో జొకోవిచ్ అదే తేడాతో గెలిచాడు. ఇరువురు ఆటగాళ్లు చెరి రెండు సెట్లను సాధించడంతో, చివరిదైన మూడో సెట్ తీవ్ర ఉత్కంఠ మధ్య మొదలైంది. థియేమ్ 4-1 ఆధిక్యంలో ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వాన తగ్గిన తర్వాత మళ్లీ ఆటను కొనసాగించగా, థీమ్ 7-5 తేడాతో ఆ సెట్‌ను గెల్చుకొని, ఫైనల్లో రాఫెల్ నాదల్‌ను ఢీకొనే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో అతను ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి.