క్రీడాభూమి

‘కూకబురా’తో మరింత స్వింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 7: కూకబురా బంతులకు మెరుపు ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా విపరీతమైన స్వింగ్ సాధ్యమవుతుందని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో కెరీర్‌లో 150 వనే్డ ఇంటర్నేషనల్స్ మైలురాయిని చేరుకున్న అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూకబురా బంతుల కారణంగానే ప్రస్తుత ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఎక్కువగా భారీ స్కోర్లు నమోదు కావడం లేదన్నాడు. లో స్కోర్ మ్యాచ్‌లైనప్పటికీ, ప్రతి పోరు హోరాహోరీగా కొనసాగుతున్నదని అన్నాడు. బంతి ఎంత వరకు స్వింగ్ అవుతుందనే అంశంపైనే పేసర్ రాణించేది, విఫలమయ్యేది ఆధారపడి ఉంటుందన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పిచ్‌లు, వాతావరణం ఆటకు ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నాడు. బంతి వేగవంతమైన కదలిక తనకు ఎంతో నచ్చిందని, ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడు. కూకబురా తెల్ల బంతులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ తమకు ఎంతో కీలకమైనదని, ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడం లేదని తెలిపాడు.