క్రీడాభూమి

గబ్బర్.. సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: గబ్బర్ సూపర్ సెంచరీ.. రన్ మెషీన్, హిట్ మ్యాన్ అదిరిపోయే అర్ధ సెంచరీలకు తోడు పాండ్యా, ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్.. ఇదీ స్పిరీట్ అంటే.. అదీ ప్రపంచకప్‌లో.. ఇంతకంటే భారత క్రికెట్ అభిమానులకు ఇంకేం కావాలి? దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కొంత తడ‘బ్యాటు’ గురైన విరాట్ సేన.. ఆస్ట్రేలియాను మాత్రం ‘కంగారె’త్తించింది. క్రీజులో నిలదొక్కుకునేంత వరకూ నెమ్మదిగా సాగిన ఆట ఆ తర్వాత స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రోహిత్ శర్శ సెంచరీ చేయగా, ఈసారీ ఆ బాధ్యతను ధావన్ తీసుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయభేరి మోగించింది.
భారత బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోవడంతో ఆదివారం లండన్ వేదికగా ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండి యా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి 5 ఓవర్లు 18 పరుగులు, 10 ఓవర్లలో 41 పరగులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా బౌలర్లు ఆ తర్వాత తేలిపోయారు. క్రీజులో కుదురుకున్నాక భారత ఓపెనర్లు బౌండరీలతో వీరుచుకుపడ్డారు. ఈ దశలో ధావన్ 53 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకొని, పరుగులు రాబట్టేందుకు ఆటలో మరింత వేగం పెంచాడు. మరోవైపు రోహిత్ శర్మ (57) సైతం ధాటిగా ఆడి తన కెరీర్‌లో 42వ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన కౌల్టర్ నైల్ అద్భుత బంతితో రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ మొదట పరుగులు తీసేందుకు తడబడ్డా, కుదురుకున్నాక చెలరేగి ఆడాడు. అప్పటికీ సెంచరీకి చేరువలో ఉన్న ధావన్ సింగిల్స్, డబుల్స్‌పైనే దృష్టి సారించాడు. మార్కస్ స్టొయనిస్ వేసిన 33వ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసిన ధావన్ తన 17వ సెంచరీ సాధించాడు. ఈ దశలో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలు కొట్టి మంచి ఊపు మీద కనిపించిన ధావన్ (117) స్టార్క్ బౌలింగ్‌లో సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ లియాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లోనే నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లతో 48 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికీ భారత్ 3 వికెట్లు కోల్పోయ 301 పరుగులు చేసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కెప్టెన్ కోహ్లీ తన కెరీర్‌లో 50వ అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీతో జతకట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు ధోనీ సైతం 14 బంతుల్లోనే 27 పరగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి స్టొయనిస్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ తను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ మలిచాడు. మరోవైపు చివరి ఓవర్ 5వ బంతికే విరాట్ కోహ్లీ (82) స్టొయనిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక చివరి బంతిని రాహుల్ (11, నాటౌట్) బౌండరీ బాదడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయ 352 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు కేదార్ జాదవ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టొయనిస్ 2 వికెట్లు పడగొట్టగా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
స్మిత్, వార్నర్ అర్ధ శతకం..
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా మొదటి నుంచే ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (36) వికెట్‌ను కోల్పోయంది. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఫించ్ మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్‌తో కలిసి వార్నర్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ దశలో అర్ధ సెంచరీ సాధిం చాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని చాహల్ విడదీశాడు. చాహల్ వేసిన 24వ ఓవర్‌లో వార్నర్ (56) భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (42) ధాటిగా ఆడే క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ (69), అర్ధ సెంచరీ సాధించి భువనేశ్వర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయనిస్ (0)ని భువనేశ్వర్ బౌల్డ్ చేయగా, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (28) చాహల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. ఆ తర్వాత నాథన్ కౌల్టర్ నైల్ (4), ప్యాట్ కమిన్స్ (8)లను బుమ్రా పెవిలియన్ పంపాడు. మిచెల్ స్టార్క్ (3), ఆడమ్ జంపా (1) చివరి బంతికి అవుటయ్యాడు. అలెక్స్ క్యారీ (55, నాటౌట్) చివర్లో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించినా కంగారులు విజయం అందించలేకపోయాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ కుమార్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, యుజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు.

స్కోర్ బోర్డు..
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) అలెక్స్ (బీ) కౌల్టర్ నైల్ 57, శిఖర్ ధావన్ (సీ) లియాన్ (బీ) స్టార్క్ 117, విరాట్ కోహ్లీ (సీ) ప్యాట్ కమిన్స్ (బీ) స్టొయనిస్ 82, హార్దిక్ పాండ్యా (సీ) ఫించ్ (బీ) ప్యాట్ కమిన్స్ 48, మహేంద్ర సింగ్ ధోనీ (సీ) (బీ) స్టొయనిస్ 27, లోకేష్ రాహుల్ (నాటౌట్) 11, కేదార్ జాదవ్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 10 మొత్తం: 352 (50 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-127, 2-220, 3-301, 4-338, 5-348
బౌలింగ్: ప్యాట్ కమిన్స్ 10-0-55-1, మిచెల్ స్టార్క్ 10-0-74-1, నాథన్ కౌల్టర్ నైల్ 10-1-63-1, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 7-0-45-0, ఆడమ్ జంపా 6-0-50-0, మార్కస్ స్టొయనిస్ 7-0-62-2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సీ) భువనేశ్వర్ (బీ) చాహల్ 56, ఆరోన్ ఫించ్ (రనౌట్) కేదార్ జాదవ్/హార్దిక్ పాండ్యా 36, స్టీవెన్ స్మిత్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) భువనేశ్వర్ 69, ఉస్మాన్ ఖాజా (బీ) బుమ్రా 42, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (సీ) రవీంద్ర జడేజా (బీ) చాహల్ 28, మార్కస్ స్టొయనిస్ (బీ) భువనేశ్వర్ 0, అలెక్స్ క్యారీ (నాటౌట్) 55, నాథన్ కౌల్టర్ నైల్ (సీ) కోహ్లీ (బీ) బుమ్రా 4, ప్యాట్ కమిన్స్ (సీ) ధోనీ (బీ) బుమ్రా 8, మిచెల్ స్టార్క్ (రనౌట్) విజయ్ శంకర్/్భవనేశ్వర్ 3, ఆడమ్ జంపా (సీ) రవీంద్ర జడేజా (బీ) భువనేశ్వర్ 1.
ఎక్స్‌ట్రాలు: 14 మొత్తం: 316 (50 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-61, 2-133, 3-202, 4-238, 5-238, 6-244, 7-283, 8-300, 9-313, 10-316
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-50-3, జస్ప్రీత్ బుమ్రా 10-1-61-3, హార్దిక్ పాండ్యా 10-0-68-0, కుల్దీప్ యాదవ్ 9-0-55-0, యుజువేంద్ర చాహల్ 10-0-62-2, కేదార్ జాదవ్ 1-0-14-0.

చిత్రాలు.. శిఖర్ ధావన్ (117) *విరాట్ కోహ్లీ (82)