క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూన్ 10: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంత ర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. భార్య, తల్లితో కలిసి సోమవారం ముంబయలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో యువీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లా డుతూ ‘క్రికెట్ నాకు జీవితంలో అన్నీ ఇచ్చింది. అందుకే అదంటే ఇష్టం. అదే సమయంలో మానసికంగా ఎంతో క్షోభకు గురిచేసింది. అందుకే అదంటే అసహ్యం (నవ్వు). నేను సక్సెస్ సాధించిన దానికంటే ఎక్కువసార్లు ఫెయల్ అయ్యా. దేశం కోసం ఆడడం కోసం రక్తం. స్వేదం ధార పోశా. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం’ అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాకుండా ‘2014లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ నా జీవితంలో అత్యంత చెత్త రోజు. ఆ రోజే నాకెరీర్ ముగిసిందనుకున్నా. ఇక 2019 ఐపీఎల్ నాకు చివరిదని గతేడాదే నిర్ణయంచుకున్నా’ అని పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని తెలిపాడు. 19 ఏళ్లుగా తనను ప్రోత్సహించిన తల్లి దండ్రులు, సహ చరులకు కృతజ్ఞతలు తెలిపాడు. యువీ 2017 తర్వాత భారత జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి ఫాం లేమీతో పాటు యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురుకావడం కూడా కారణం. 2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలవడమే కాకుండా, భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో అతడి కృషి ఎంతో ఉంది. అయతే రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ అనుమతిస్తే ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లాండ్‌లలో జరిగే టీ20 టోర్నీల్లో యువరాజ్ ఆడనున్నట్లు తెలుస్తోంది.

చిత్రం...భార్య, తల్లితో యువరాజ్ సింగ్