క్రీడాభూమి

యువీ రిటైర్మెంట్‌పై ఎవరేమన్నారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినందనలు పాజీ: కోహ్లీ
‘దేశం తరఫున అద్భుతమైన క్రికెట్ ఆడావు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో పాటు గొప్ప విజయాలను మాకు అందించావు. నీకు ఆల్ ది బెస్ట్. సంపూర్ణ విజేత’ అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.
అరుదైన క్రికెటర్: సెవాగ్
యువరాజ్ సింగ్ అరుదైన క్రికెటర్ అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెవాగ్ అన్నాడు. యువీ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా సెవాగ్ ట్విట్టర్‌లో ప్రశంస లు కురిపించాడు. యువరాజ్ ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నిలి చాడని, పోరా టపటిమ, ఆత్మవిశ్వాసంతో ఎందరికో ఆద ర్శంగా నిలిచాడని పేర్కొన్నాడు.
ప్రతిసారీ ఓ విజేతగా.. : సచిన్
నీదెంత అద్భుతమైన కెరీర్ యువీ. జట్టుకు అవసరమైన ప్రతిసారీ ఓ విజేతగా తిరిగొచ్చావు. ఒడిదుడుకుల్లో, మైదానంలో నువ్వు పడిలేచిన విధానం అద్భుతం. నీ రెండో ఇ న్నింగ్స్‌కు శుభాకాంక్షలు. క్రికెట్‌కు నువ్వు చేసిన సేవలకు ధన్యవాదాలు
జెర్సీ నెం.12కు రిటైర్మెంట్ ఇవ్వాలి : గౌతమ్ గంభీర్
అభినందనలు ప్రిన్స్. యువీ నీది అద్భుతమైన కెరీర్. భారత క్రికెట్‌లో అత్యుత్తమ తెలుపు బంతి క్రికెటర్ నువ్వు. అతడి కెరీర్‌కు గుర్తుగా బీసీసీఐ జెర్సీ నెం.12కు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఓ విజేతా.. నేను నీలా ఆడాలని కోరుకునేవాడిని