క్రీడాభూమి

టైగర్స్ X లయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ నేడు శ్రీలంక జట్టుతో తలపడనుంది. రికార్డుల పరంగా చూస్తే శ్రీలంకదే పైచేయిగా కనిపించినా, ప్రస్తుత జట్టులో కొత్త ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ఒక్కరిద్దరున్నా ఫాం లేమీతో జట్టు బలహీనంగానే కనిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఎప్పటిలాగే ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇస్తుండగా, ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా జట్టుపై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో తామింకా పసికూనలం కాదనే భావనను ప్రత్యర్థి జట్లు తెలుసుకోవాలంటూ సవాల్ కూడా విసిరింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో బలంగా ఉన్న దక్షిణాఫ్రికాకు 330 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించిందంటే బంగ్లా ఆటగాళ్లు ఫాంలో ఉంటే ఏ జట్టునైనా ఓడించగలమనే ధీమాలో ఉన్నారు. మొదటి మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలను ముస్తాఫిజుర్ రహమన్, మహమ్మద్ సైఫుద్దీన్ పెవిలియన్‌కు పంపి జట్టుకు ఈ మెగా టోర్నీలో చారిత్రక విజయాన్ని అందించారు. అయతే రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 244 పరుగులకే కుప్పకూలినా, లక్ష్యాన్ని కాపాడుకునేందుకు చివరి వరకూ బంగ్లా పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. న్యూజిలాండ్ 48వ ఓవర్‌లో 8 వికెట్లు కోల్పోయ విజయం సాధించిందంటే బంగ్లా బౌలర్ల ప్రతిభే కారణం. మెహిడి హసన్, మహమ్మద్ సైఫుద్దీన్, షకీబ్ అల్ హసన్, మెసాదీక్ హసన్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టినా చివర్లో న్యూజిలాండ్‌నే విజయం వరించింది. ఇక ఇంగ్లాండ్‌తో మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించి తప్పుచేసిందనే చెప్పాలి. ఆతిథ్య జట్టుకు ఇక్కడి పిచ్‌లపై పూర్తి బలం ఉంటుందని తెలిసి కూడా బంగ్లా కెప్టెన్ తప్పటడుగు వేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 6 వికెట్లు కోల్పోయ 386 పరుగుల భారీ స్కోరును బంగ్లా ముందుంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 280 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
షకీబ్ ఒక్కటే..
బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నా మెగా టోర్నీలో తలపడిన మూడు మ్యాచుల్లోనూ షకీబ్ అల్ హసన్ అటు బాల్, ఇటు బ్యాట్‌తోనూ ఒక్కడే రాణించాడు. దీంతో జట్టు భారమంతా అతడిపైనే పడుతోంది. దక్షిణాఫ్రికాపై (75), న్యూజిలాండ్‌పై (64), ఇంగ్లాండ్‌పై (121) పరుగులతో మిగతా ఆటగాళ్ల కంటే ముందువరుసలో ఉన్నాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. షకీబ్‌కు తోడు సీనియర్ బ్యాట్స్‌మెన్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ రాణిస్తే బంగ్లాకు తిరుగుండదు.
లంకేయుల తడబాటు..
గత ప్రపంచకప్‌లో దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బరిలోకి దిగిన లంకేయులు ఈసారి కొత్త కుర్రాళ్లతో మైదానంలోకి అడుగుపెట్టింది. ఇందులో కె ప్టెన్ దిముత్ కరుణరత్నే సహా చాలామంది కొత్తవారే కావడం విశేషం. అయతే కెప్టెన్ కరుణరత్నే మాత్రం అంతర్జాతీయ వనే్డల్లో తక్కువ మ్యాచ్‌లే ఆడిన అతడి ప్రస్తుత ఆట తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 136 పరుగులకే ఆలౌటైనా, కరుణరత్నే (52) పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయతే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే కేవలం 29.2 ఓవర్లలో తక్కువ స్కోరుకే కుప్పకూలడం లంక జట్టును కుంగదీసిందనే చెప్పాలి. అయతే రెండో మ్యాచ్‌లో అఫ్గాన్‌పై కూడా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక 36.1 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అదృష్టవశాత్తూ వర్షం పడడంతో డక్‌వర్త్ లూయస్ పద్ధతిలో 41 పరగుల తేడాతో మొదటి విజయాన్ని అందుకుంది. నువాన్ ప్రదీప్ 4, లసిత్ మలింగ 3 వికెట్లతో అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ల వెన్నువిరిచారు. గెలుపుతో జోరుమీదున్న లంక మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడగా, టాస్ కూడా వేయకుండానే వర్షం అడ్డుపడడంతో ఇరు జట్లకు చెరో పాయంట్ లభించింది. దీంతో పాయంట్ల పట్టికలో బంగ్లా మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచి 2 పాయంట్లు సాధించగా, లంక మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడి, ఇంకొకటి ఫలితం తేలకపోవడంతో 3 పాయంట్లు సాధించింది.
లంకదే పైచేయి..
ప్రపంచకప్ టోర్నీలో మూడు సార్లు ఇరు జట్లు తలపడగా అన్నింట్లో శ్రీలంకనే విజయం సాధించడం విశేషం. 2003లో 10 వికెట్లతో గెలిచిన లంక, 200లో 198 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఇక 2015లో 92 పరుగులతో బంగ్లాను చిత్తుచేసింది.

చిత్రాలు.. నెట్ ప్రాక్టీస్‌లో బంగ్లా ఆటగాడు సౌమ్యా సర్కార్ * శ్రీలంక ఆటగాడు మిలింద సిరివర్ధ్దన