క్రీడాభూమి

గంజాయి వాడితే దండన తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని చట్టాలు ఎలా ఉన్నప్పటికీ, జపాన్‌లో గంజాయి సేవిస్తే కఠిన దండన తప్పదని 2020 ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో కొన్ని దేశాలు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేశాయి. 21 ఏళ్లు నిండిన ఎవరైనా వినోదం కోసం గంజాయి పొగను పీల్చవచ్చు. ఈ అంశం టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ (ఓసీ) సమావేశంలో చర్చకు వచ్చింది. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నతో మిగతా వారంతా అప్రమత్తమయ్యారు. వెంటనే దీనిపై వివరణనిస్తూ, అన్ని దేశాల క్రీడా బృందాల అధికారులకు సమాచారాన్ని అందించారు. అంతేగాక, ఒక బహిరంగ ప్రకటన కూడా చేశారు. జపాన్‌లో గంజాయిని వినియోగిస్తే ఐదేళ్లు, అమ్మితే ఏడేళ్ల శిక్ష వరకూ ఉంటుంది.