క్రీడాభూమి

ఒత్తిడి ఎందుకుంటుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 13: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఏ స్థాయిలో మ్యాచ్ ఆడినా అది ఓ యుద్ధాన్ని తలిపిస్తుంది. ఇక ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ లాంటి మెగా ఈవెంట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతటి హై ఓల్టేజ్ మ్యాచ్‌పై టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తనదైన శైలిలో స్పందించాడు. ఈసారి వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆదివారం భారత్ ఢీకొననుంది. ఈ మ్యాచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వీడియోలో ‘టీమిండియాపై ఒత్తిడి ఎందుకుంటుంది? కేవలం 150 కోట్ల మందే కదా పాక్‌పై భారత్ గెలావలని అనుకుంటున్నది’ అని హార్దిక్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్‌ను సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. ‘జూలై 14వ తేదీ నాటికి ప్రపంచ కప్ ట్రోఫీ నా చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ క్రమంలో నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టించుకోను. నా ప్రణాళిక చాలా సాధారణం. ప్రపంచ కప్‌ను సాధించడమే. ఇది సాధ్యమవుతుందని అనుకుంటున్నాను’ అన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమన్నాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో మక్కువని, జట్టుకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తానని చెప్పాడు. తాను వచ్చిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే, తనకు, తన సోదరుడు కృణాల్ పాండ్యకు ఎలాంటి అవకాశాలు లభించినా వాటిని బోనస్‌గానే పరిగణించాల్సి ఉంటుందని అన్నాడు. 2011లో భారత జట్టు ప్రపంచ కప్‌ను సాధించినప్పుడు, ఏదో ఒక రోజున దేశం తరఫున ఈ మెగా ఈవెంట్‌లో ఆడాలని అనుకున్నట్టు హార్దిక్ చెప్పాడు. ఇటీవలే తన స్నేహితుడు ఓ ఫొటోను పంపిస్తూ, అది ఏ సందర్భంలో తీసిందో గుర్తుందా? అని ప్రశ్నించినట్టు తెలిపాడు. ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధించినప్పుడు తామంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నప్పటి ఫొటో తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పాడు. రాత్రి సమయంలో అంత మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టడం అంతకు ముందెన్నడూ తాను చూడలేదని హార్దిక్ అన్నాడు. తన ప్రాంతంలోనేగాక, దేశ వ్యాప్తంగా అప్పుడు పండుగ వాతావరణం నెలకొందన్నాడు. అలాంటి ఆనందాన్ని ప్రజల్లో మరోసారి చూడాలన్నదే తన ఆశయమని, అందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అన్నాడు. జట్టు మొత్తం ఇదే పట్టుదలతో ఉందని చెప్పాడు.