క్రీడాభూమి

గెలిస్తేనే నిలుస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూన్ 14: ఈసారి వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించే అవకాశాలున్న జట్లలో ఒకటిగా పేరు సంపాదించినప్పటికీ, మైదానంలో దిగిన తర్వాత వరుస పరాజయాలతో అల్లాడుతున్న దక్షిణాఫ్రికా శనివారం అఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఒక రకంగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఈ మెగా టోర్నీలో ముందంజ వేసే అవకాశాలు కొంత వరకైనా సజీవంగా ఉంటాయి. లేకపోతే, ఈ జట్టు సెమీస్ చేరడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘పసికూన’ అఫ్గాన్‌తో పోరు కాబట్టి, దీనిని గెల్చుకోవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని, ఆ తర్వాత జరగబోయే మిగతా మ్యాచ్‌ల్లో రాణించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రొది వేసుకోవాలని ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా భావిస్తున్నది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొని, 104 పరుగుల తేడాతో ఈ జట్టు చిత్తయింది. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేస్తే, దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. కార్డ్ఫిలోనే, సోఫియా గార్డెన్స్‌లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ 6 వికెట్లకు 330 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగులకు పరిమితమై, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఈ జట్టుకు మూడో మ్యాచ్‌లో టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకటైన టీమిండియా ఎదురైంది. అనుకున్నట్టుగానే ఆ మ్యాచ్‌ని సైతం కోల్పోయింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేయగా, భారత్ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత, సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌లో వెస్టిండీస్‌తో పోరుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఒక పాయింట్‌ను దక్కించుకుంది. కాగితంపై చూస్తే అన్ని విభాగాల్లోనూ అఫ్గాన్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న డు ప్లెసిస్ సేన మైదానంలో ఎంత వరకూ తన స్థాయికి తగిన ఆటను ప్రదర్శిస్తుందో చూడాలి.
అంచనాలకు దూరం
అఫ్గాన్‌పై ఎవరికీ, ఎలాంటి అంచనాలు లేవు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీకి అర్హత సంపాదించడమే గొప్పగా భావిస్తున్న ఈ జట్టు ఇంత వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి, మూడింటిలోనూ ఓటమిపాలైంది. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ గట్టిపోటీని ఇవ్వడానికి శక్తివంచన లేకుండా కృషి చేసింది. మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడి, 38.2 ఓవర్లలో 207 పరుగులు చేయగలిగింది. అనంతరం ఆసీస్ 34.5 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఎదుర్కొని, 34 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 32.4 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఆతర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అనంతరం ఆటను కొనసాగించగా, డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించి అఫ్గాన్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 187 పరుగులుగా నిర్ధారించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగిన అనుభవం లేని ఈ జట్టు వర్షంతో చిత్తడిగా మారిన పిచ్‌పై ఆడలేకపోయింది. 32.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మూడో మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఎదుర్కొంది. 41.1 ఓవర్ల వరకూ పోరాడి, 172 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ 32.1 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ బలమైన ప్రత్యర్థులే ఎదురుకావడంతో పరాజయాలను చవిచూసినప్పటికీ, అఫ్గాన్ ఎప్పుడైనా ఎదురుదాడికి దిగే ప్రమాదం లేకపోలేదు. నిలదొక్కుకుంటే, ఎంతటి జట్టునైనా మట్టికరిపించే సత్తావున్న అఫ్గాన్ శనివారం దక్షిణాఫ్రికాతో ఎలా ఆడుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది.