క్రీడాభూమి

ధోనీ ఉన్నాడుగా.. బెంగ లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 14: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌కి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ, తనకు టికెట్ లభిస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని మహమ్మద్ బషీర్ ధీమా వ్యక్తం చేశాడు. ధోనీ ఉండగా బెంగ పడాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించాడు. ‘చాచా చికాగో’గా అందరికీ తెలిసిన బషీర్‌కు ధోనీ అంటే అంతులేని అభిమానం. త్రివర్ణ పతాకం ఉన్న దుస్తులతో, చేతిలో పాకిస్తాన్ జాతీయ జెండాతో స్టాండ్స్‌లో హల్‌చల్ చేసే బషీర్ ఆదివారం భారత్, పాక్ మ్యాచ్‌ని చూసేందుకు చికాగో నుంచి సుమారు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి మాంచెస్టర్ చేరుకున్నాడు. టికెట్ లేకుండానే అతను ఎంతో ధీమాతో కనిపించడం విశేషం. ఈ విషయాన్ని పీటీఐ ప్రతినిధి ప్రస్తావించగా, 2011 నుంచి ఇప్పటి వరకూ తాను తిలకించే ప్రతి మ్యాచ్ టికెట్ ధోనీయే ఇప్పిస్తున్నాడని బషీర్ చెప్పాడు. ఇంత వరకూ ధోనీ నుంచి తనకు ఎప్పుడూ నిరాశ ఎదు రుకాలేదని, ఈసారి కూడా టికెట్ అతనే ఇస్తాడని చెప్పాడు. తన భార్య స్వస్థలం హైదరాబాద్ కాబట్టి, తనకు భారత్ అంటే ప్రత్యేక గౌరవం ఉందన్నాడు. అదే విధం గా తాను స్వతఃగా పాక్ జాతీయుడ్ని కాబ ట్టి ఆ దేశానికి మద్దతునిస్తానని చెప్పాడు. ఇరు దేశాల మధ్య తాను శాంతి దూతగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. మాంచెస్టర్ చేరుకున్న వెంటనే, పాకిస్తాన్ క్రికెటర్లు బస చేసిన హోటల్‌కు వెళ్లి కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్, మహమ్మద్ అమీర్, హసన్ అలీ, షోయబ్ మాలిక్ తదితరులను కలిశాడు. అనంతరం భారత క్రికెటర్ల బసకు వెళ్లి ధోనీ తదితరులతో కొంత సేపు గడిపాడు. సచిన్ తెండూల్కర్ వీరాభిమాని సుధీర్‌తో కలిసి హోటల్ గదిని పంచుకుంటున్నాన ని, భారత్, పాక్ స్నేహానికి ఇదో గుర్తని బషీర్ అన్నాడు. 60 ఏళ్లు పైబడిన బషీర్ ఇప్పటికే మూడు పర్యాయాలు గుండె పోటు నుంచి బయటపడ్డాడు. తన వెంట 12 రకాల మందులను తెచ్చుకున్న అతను ఆరోగ్యం పూర్తిగా సహకరించడం లేదని అన్నాడు. అయతే, క్రికెట్ మ్యాచ్‌లు జరు గుతున్నంత వరకూ తన ఊపిరి కొనసాగు తూనే ఉంటుందని చమత్కరించాడు. భారత్, పాక్ జట్ల మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచినా తాను ఆనందిస్తానని చెప్పాడు. ధోనీ వంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకూ చూడలేదని చికాగోలో ఓ రెస్ట్రాంట్‌ను నడిపిస్తున్న బషీర్ ప్రశంసిం చాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాడ్ ధోనీకి ఒక బహుమతి ఇస్తానని చెప్పాడు. అది ఏమిటనేది మాత్రం రహస్యమని అతను అన్నాడు.