క్రీడాభూమి

కంగారూలతో కష్టమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయ. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో ఇరు జట్లు నాలుగేసి మ్యా చ్‌లు ఆడగా ఆసీస్ మూడు విజయాలతో ముందు వరుసలో నిలిచి దూకుడు మీదుంది. ఇక శ్రీలంక ఒక్క విజయంతోనే కంగారూలను ఢీకొనబోతుంది.
ఆడిన మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైన లంక, ఆ తర్వాత పసికూన అఫ్గాని స్తాన్‌తో తలపడగా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆడకుండానే లంక జట్టుకి రెండు పాయంట్లు లభించాయ.
లంకకు కష్టమే..
గత ప్రపంచకప్ శ్రీలంక జట్టుకు, నేటి జట్టుకు చాలా తేడా ఉంది. గతంలో జయవర్దనే, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్లతో జట్టు బలంగా కనిపించింది. అయతే ఆటగాళ్ల రిటైర్మెంట్, బోర్డులో సంక్షోభంతో జట్టులో ఇద్దరూ, ముగ్గురు మినహా అంతా కొత్తవారే కావడం జట్టుకు ప్రతికూలంగా మారింది. మరోవైపు సినీయర్, మాజీ కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్‌తో పాటు తిసారా పెరీరా ఫాంలో లేకపోవడం కూడా లంకకు నష్టాన్ని కలిగించే అంశమే. ఇక లసిత్ మలింగ ఒక్కడే సీనియర్ బౌలర్ కావడంతో బౌలింగ్ భారమంతా అతడిపైనే పడుతుం దనడంలో సందేహం లేదు. ఇన్ని ప్రతికూలతల నడు మ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఏదైనా అద్భు తం జరిగితే తప్ప లంక గెలవడం దాదాపు అసాధ్యమే.
పాక్‌పై గెలుపుతో జోరుమీదున్న ఆసీస్..
ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే పాక్‌పై గెలుపుతో మరింత జోరు మీదుంది. బుధవారం జరిగిన ఈ మ్యా చ్‌లో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలా యంచి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచుల్లో భారత్ మినహా, అఫ్గాన్, వెస్టిండీస్‌ల పైనా గెలిచి, టోర్నీలో అగ్రభాగాన నిలిచిందనే చెప్పా లి. కంగారూలకు లంకపై గెలుపు నల్లేరు మీద నడకనే.
కంగారూలదే పైచేయ..
ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో ఆస్ట్రేలి యా జట్టే పైచేయగా నిలిచింది. 1975, 1992, 2003, 2007, 2015 ప్రపంచకప్‌లలో ఆసీస్ లంకపై గెలిచిం ది. మొత్తంగా ఇరు జట్లు 10 మ్యాచుల్లో తలప డగా ఆస్ట్రేలియా 7 మ్యాచుల్లో విజయం సాధించగా, లంక రెండింట్లో మాత్రమే పై చేయ సాధించింది. 2011 ప్రపంచకప్‌లో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది.
గత ప్రపంచకప్‌లో స్వల్ప తేడాతో ఓటమి..
2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ లంక జట్టు 64 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవి చూ సింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణిత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 376 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. లక్ష్య ఛేదనకు దిగిన లంక కుమార సంగక్కర సెంచరీతో పాటు తిలకరత్నే దిల్షాన్, దినేష్ చండిమల్ అర్ధ సెంచరీలతో గెలుపు ఖాయమైనట్లే కనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలమవడంతో 64 పరుగుల తేడాతో ఓడిపోయంది.

అప్పుడే రెండుసార్లు..

శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై గెలిచింది రెండు సార్లే. అది కూడా 1996 ప్రపంచకప్‌లోనే గెలిచి టోర్నీని మొదటిసారి ముద్దాడింది. అప్పటి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడాల్సి ఉండగా శ్రీలం కలో జరిగిన పేలుళ్ల కారణంగా ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌లో శ్రీలంకను విజేతగా ప్రకటించారు. ఇదే టోర్నీలో ఇరు జట్లు మళ్లీ ఫైనల్‌లో తలపడ్డాయ. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానిం చగా, 7 వికెట్లు కోల్పోయ 241 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక 46.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయ మొదటిసారి ప్రపంచకప్‌ని అందుకుంది. ఈ మ్యాచులో అరవింద డిసిల్వ సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.