క్రీడాభూమి

గెలుస్తామన్న ధీమా వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 15: పాకిస్తాన్‌పై ప్రపంచ కప్‌లో ఇంత వరకూ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయాలను నమోదు చేసిన నేపధ్యంలో, ఆదివారం నాటి గ్రూప్ మ్యాచ్‌లో మళ్లీ గెలుస్తామన్న ధీమా తగదని టీమిండియా సభ్యులకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హితవు పలికాడు. ఏ మాత్రం నిర్లక్ష్య ధోరణని ప్రదర్శించకుండా, అన్ని విభాగాల్లోనూ రాణించాలని సూచించాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ భారత్ అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. వరల్డ్ కప్‌లో పాక్‌పై విజయ పరంపరను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటారని, వారి అంచనాలకు తగినట్టు రాణించాల్సిన బాధ్యత భారత క్రికెటర్లపై ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని అంగీకరించాడు. అందుకే, ప్రతి విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆడాలని అన్నాడు. 2003లో తన కెప్టెన్సీలో పాక్‌పై టెస్టు, వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకున్న విషయాన్ని గంగూలీ ప్రస్తావించాడు. భారత క్రికెట్ అభిమానులకు పాక్‌పై విజయమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు. అందుకే, సరైన వ్యూహరచన ఉండాలని అన్నాడు. భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటూనే, ప్రత్యర్థి ఎవరైనా సరే తక్కువ అంచనా వేయడం తగదని స్పష్టం చేశాడు.