క్రీడాభూమి

బ్రాత్‌వెయిట్‌కు మందలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 15: వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి ప్రదర్శించినందుకు వెస్టిండీసఆ ఆల్‌రౌండర్ కార్లొస్ బ్రాత్‌వెయిట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, 43వ ఓవర్‌లో జొఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. అయితే, బంతి తన బ్యాట్‌కు తగల్లేదంటూ అంపైర్‌కు సూచిస్తూ, అతని నిర్ణయం పట్ల అసంతృప్తిని ప్రకటించాడు. ఈ సంఘటనపై ఫీల్డ్ అంపైర్లు సుందరం రవి, కుమార ధర్మసేన చేసిన ఫిర్యాదును ఐసీసీ పరిశీలించింది. బ్రాత్‌వెయిట్ వివరణనిస్తూ, తాను పొరపాటు చేశానని అంగీకరించాడు. తొలి అపరాధం కింద తనను క్షమించాలని కోరాడు. ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు డేవిడ్ బూన్ సూచన మేరకు ఐసీసీ అతనిని మందలించి విడిచిపెట్టింది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.