క్రీడాభూమి

గెలిచినా.. ఓడినా.. టోర్నీ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 15: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే గ్రూప్ మ్యాచ్‌లో తాము గెలిచినా, ఓడినా, ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ మాత్రం ఆగదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. శనివారం నెట్స్‌లో అతను ఎంతో సరదాగా కనిపించాడు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, పాక్‌తో మ్యాచ్ కంటే ఇంకా పెద్ద లక్ష్యాన్ని సాధించడానికే తాము వచ్చామని అన్నాడు. పాక్, భారత్ మ్యాచ్ అనగానే సర్వత్రా నెలకొనే ఉత్కంఠ, యుద్ధ వాతావరణం, ఇరు దేశాల్లో సర్వత్రా వ్యాపించే మ్యాచ్ ఫీవర్ వంటి అంశాలపై విలేఖరులు పదేపదే ప్రశ్నించినా, కోహ్లీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒకానొక సమయంలో అసహనానికి గురైన అతను ‘మ్యాచ్ ఒక నిర్ణీత సమయానికి మొదలవుతుంది. ఒక సమయానికి ముగుస్తుంది. అంతేగానీ జీవితాంతం ఉండదు. పాక్‌తో మ్యాచ్ కూడా అంతే. దానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పాక్‌పైనేకాదు, టోర్నీలో ఆడే ప్రతి మ్యాచ్‌నీ గెల్చుకోవాలన్నదే మా లక్ష్యం. అదే విషయంపై దృష్టి కేంద్రీకరించాం. ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వం’ అని స్పష్టం చేశాడు. తాము బాగా ఆడినా, ఆడకున్నా మ్యాచ్ మాత్రం పూర్తవుతుందని వ్యాఖ్యానించాడు. టోర్నమెంట్ మాత్రం కొనసాగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. పాక్ పేసర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌కు, భారత కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌కు మధ్య పోరుగా ఆదివారం నాటి మ్యాచ్‌ని కొన్ని చానెళ్లు అభివర్ణించాయి. దీనిపై కోహ్లీ స్పందిస్తూ, టీఆర్పీ రేట్స్ కోసం ఎవరైనా, ఏదైనా అంటారని అన్నాడు. ఇలాంటి వార్తపై తాను స్పందించబోనని చెప్పాడు. సమర్థుడైన బౌలర్‌గా తాను గౌరవిస్తానని, ఇంతకు ముందు కాగిసో రబదా గురించి కూడా ఇదే విషయాన్ని చెప్పానని అన్నాడు. అంతకు మించి మాట్లాడాల్సింది ఏమీ లేదని చెప్పాడు.

చిత్రం...నెట్స్‌లో సరదాగా..కోహ్లీ ప్రాక్టీస్