క్రీడాభూమి

టీవీలో ప్రకటనపై పీసీబీ అభ్యంతరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 16: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్‌లో కొంతకాలంగా వస్తున్న ఒక ప్రకటన పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘వౌకా వౌకా’ (అవకాశం అవకాశం) అంటూ వచ్చే ప్రకటనలో భారత జట్టు అభిమాని ఒకరు పాకిస్తాన్ అభిమానితో ‘నేను నీ తండ్రిని’ అనే ఉద్దేశం వచ్చేలా మాటలు ఉన్నాయని పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రపంచ కప్ టోర్నీలో ఆరు పర్యాయాలు భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆదివారం నాటి మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందని పాకిస్తాన్ అభిమానిని ఓ బంగ్లాదేశ్ అభిమానిని ఆ ప్రకటనలో అడుగుతాడు. అందుకు పాక్ అభిమాని సమాధానమిస్తూ, పట్టువీడకుండా నిరంతరం ప్రయత్నిస్తునే ఉండాలని తన తండ్రి తనతో చెప్పాడని అంటాడు. అదే సమయంలో భారత్ అభిమాని ప్రత్యక్షమై ‘మైనే కబ్ కహా’ (నేను ఎప్పుడు చెప్పాను) అని పాక్ అభిమానిని ప్రశ్నిస్తాడు. పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు ఎక్కువ అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ప్రకటనను ప్రసారం చేయడంపై పీసీబీ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇషాన్ మణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిజానికి ఈ ప్రకటనపై పీసీబీ ఆగ్రహంతో ఉందనే విషయం బీసీసీఐ అధికారులకు తెలుసు. అయితే, జోక్యం చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.