క్రీడాభూమి

మూడు పర్యాయాలు డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహిత్ శర్మ వనే్డల్లో మూడు పర్యాయాలు డబుల్ సెంచరీ సాధించాడు. శ్రీలంకపై మొదటిసారి డబుల్ సెంచరీ చేసినప్పుడు, మొదటి శతకాన్ని పూర్తి చేయడానికి 115 బంతులు తీసుకున్నాడు. మరోసారి అదే జట్టుపై 264 పరుగులు నమోదు చేసినప్పుడు మొదటి సెంచరీని 100 బంతుల్లో పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాపై 209 పరుగులు సాధించగా, మొదటి వంద పరుగుల కోసం 114 బంతులు ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ, అతను ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు.
*వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 2003లో జొహానెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ అజేయంగా 143 పరుగులు చేశాడు. 140 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 2011లో పల్లేకల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 131 (నాటౌట్) పరుగులు చేశాడు.
*షాదాబ్ ఖాన్ వేసిన 30వ ఓవర్ చివరి బంతిలో ఒక పరుగు చేయడం ద్వారా రోహిత్ శర్మ కెరీర్‌లో 24వ వనే్డ సెంచరీని సాధించాడు. ఈ మైలురాయిని చేరడానికి రోహిత్‌కు 203 మ్యాచ్‌లు అవ సరమయ్యాయి. షహీం ఆమ్లా (దక్షిణాఫ్రికా) 142, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 161, ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) 192 ఇన్నింగ్స్‌లో తమతమ 24వ శతకాన్ని నమోదు చేశారు. సచిన్ 219వ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.